అన్న క్యాంటీన్ పై ఇలా మాట్లాడతారా! అంకమ రావు పొలిటికల్ అనలిస్ట్ #annacanteen #telugunews
Aadhan Telugu
0:00 / 0:00
అన్న క్యాంటీన్ పై ఇలా మాట్లాడతారా! అంకమ రావు పొలిటికల్ అనలిస్ట్ #annacanteen #telugunews
32 992 просмотра · 2 г. назад
Aadhan Telugu
2,68 млн подписчиков
32 992 просмотра · 2 г. назад
#chandrababu
ఈసారి అన్నా క్యాంటీన్లలో రేట్లు ఇవే..!
ఏపీలో ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు దర్శనమివ్వబోతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత నామమాత్రపు ధరతో నిరుపేదల కడుపు నింపేందుకు సిద్ధమయ్యాయి. నిన్న సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన నాలుగో సంతకాన్ని అన్నక్యాంటీన్ల పునరుద్దరణపైనే చేశారు. దీంతో రాష్ట్రంలో తిరిగి ఈ క్యాంటీన్ల ప్రారంభానికి మార్గం సుగమమైంది.త్వరలో అధికారికంగా దీనిపై ఉత్తర్వులు కూడా జారీ కాబోతున్నాయి.
గతంలోలాగే ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలు, రెండు పూటలా భోజనం కూడా ఐదేసి రూపాయల చెప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పేదలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం, టిఫిన్ లభించబోతున్నాయి. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపినా రోజుకు కేవలం 15 రూపాయలే అవుతుంది. దీంతో రోజుకు 15 రూపాయలకే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్దం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.