Перейти к содержимому

స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం తెచ్చిన తంటా | అవనిగడ్డలో 40 బస్సులు నిలిపివేత #avanigadda #apsrtc

Diviseema Mirror

0:00 / 0:00

స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం తెచ్చిన తంటా | అవనిగడ్డలో 40 బస్సులు నిలిపివేత #avanigadda #apsrtc

35 181 просмотр · 3 мес. назад
Diviseema Mirror
221 подписчик
35 181 просмотр · 3 мес. назад
అవనిగడ్డలో ఆర్టీసీ హైర్ బస్సుల నిలిపివేత: సిబ్బంది ఆందోళన అవనిగడ్డ: స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో హైర్ బస్సుల సర్వీసులు గురువారం ఒక్కసారిగా నిలిచిపోయాయి. బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళా ప్రయాణికులు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండటమే ఈ నిర్ణయానికి కారణమని ఆర్టీసీ వర్గాలు, హైర్ బస్సుల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో ఇటీవల కాలంలో బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో బస్సులను నిర్ణీత స్టాపుల్లో ఆపలేదనే నెపంతోనూ, సీట్లు దొరకలేదనే కారణంతోనూ డ్రైవర్లు, కండక్టర్లతో కొందరు మహిళలు తరచూ వివాదాలకు దిగుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలబడే స్థలం విషయంలో, సర్దుబాటు చేసుకునే ప్రయాణాల విషయంలో చిన్నపాటి కారణాలకే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, దాడులకు కూడా తెగబడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రోజురోజుకూ ఈ తరహా ఘర్షణలు ఎక్కువవుతుండటంతో విధి నిర్వహణ కష్టంగా మారిందని, రక్షణ లేని చోట విధులు నిర్వహించలేమని స్పష్టం చేస్తూ హైర్ బస్సుల సిబ్బంది సమ్మెకు దిగారు. ఈ అకస్మాత్తు నిలిపివేత వల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్టాండ్‌లోనే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి తమకు తగిన రక్షణ కల్పించాలని, ప్రయాణికుల్లో అవగాహన పెంచాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.