Перейти к содержимому

దీపావళి అంటే దీపాలు కాదు — ఈ 4 విషయాలు

Sit with Sneha

0:00 / 0:00

దీపావళి అంటే దీపాలు కాదు — ఈ 4 విషయాలు

57 просмотров · 3 дн. назад
Sit with Sneha
89 подписчиков
57 просмотров · 3 дн. назад
దీపావళికి మనం ఇల్లంతా శుభ్రం చేస్తాం, సదురుకుంటాం, రంగోలి వేస్తాం, లక్ష్మీ పూజ చేస్తాం, దీపాలు పెడతాం. ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాం. కానీ ఎందుకు చేస్తున్నాం అనేది మర్చిపోయాం. ఇప్పుడు మనకి decluttering వచ్చింది, energy healing వచ్చింది, చాలా రకరకాల ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. కానీ మన పండుగలో ఇవన్నీ ఇప్పటికే ఉన్నాయి. ఈ వీడియోలో ఆ నాలుగు విషయాలు చెప్పాను. ఒకటి — ఇల్లు ఖాళీ చేయడం. ఏది వద్దనిపిస్తుందో, దాన్ని ఉంచుకోకుండా ఎవరికైనా ఇచ్చేయడం. రెండు — రంగోలి. బియ్యప్పిండితో బయట వేస్తే పిట్టలకి, చీమలకి ఆహారం. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కి మనం సపోర్ట్ చేస్తున్నాం అన్న నిదర్శనం. మూడు — లక్ష్మీ పూజ. అవసరం లేని దుమ్ముని, దూళిని, వస్తువుల్ని బయటికి పంపించేశాం తల్లి, అవసరమైన వాళ్లకి ఇచ్చేశాం తల్లి, ఇప్పుడు మేము రెడీగా ఉన్నాము అని ఆహ్వానించడం. నాలుగు — దీపాలు. దీప్ అంటే దీపాలు, అవళి అంటే వరుస. నరకాసురుడిని వధించిన రోజు — ఆ చెడుని మంచి ఓవర్‌కమ్ చేయగలుగుతుంది. అంత చీకటిగా ఉన్న రోజులో కూడా దీపం బ్రైట్‌గా కనిపిస్తుంది. ఆ చీకటి అంత ఉండడం వల్లే నీకు ఆ రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో అన్నా సరే — ఈ దీపం అంత చిన్న వెలుతురు ఉన్నా సరే — నేను నా జీవితాన్ని మంచిగా, అద్భుతంగా, వెలుగులోకి తీసుకొని రాగలుగుతాను అన్న నమ్మకం వస్తుంది. ఈ దీపావళికి మీకు ఒక చిన్న పని: మీ ఇంట్లో ఒక సంవత్సరం నుంచి వాడని ఒక వస్తువు ఎంచుకోండి. దాన్ని ఒకరికి ఇవ్వండి. అప్పుడు ఒక దీపం వెలిగించి, కొన్ని సెకన్లు దాన్ని చూడండి. మీరు ఏం ఇచ్చారో కామెంట్ చేయండి. నేను చదువుతాను. Sit with Sneha — A Conversation from a woman to a woman. #SitWithSneha #దీపావళి #TeluguMom #Diwali #sitwithsneha #telugumotivation #mindset #selfgrowth #teluguyoutube #teluguselfgrowth #telugumoms #personalgrowth #teluguselfdevelopment #selfimprovement