ఈశ్వరా!మా మూఢమతిని తొలగించరా!!
Rudrageethi
0:00 / 0:00
ఈశ్వరా!మా మూఢమతిని తొలగించరా!!
495 просмотров · 8 дней назад
Rudrageethi
59 подписчиков
495 просмотров · 8 дней назад
ఏందిరా ఈలోకమన్నది ఈశ్వరా!ఓఈశ్వరా!
ఇంత మిడిజ్ఞానంలో ఉన్నది ఏమిరా?
ఇది,ఏందీరా ఈలోకులన్నది ఈశ్వరా!ఓఈశ్వరా!
ఎంత మూఢమతిలో ఉన్నది ఏమిరా?
విశదపరచిన వినగబోదు,వ్యక్తపరచిన నమ్మబోదు
ఋజువుజూపిన లెక్కజేయదు,మందలించిన మదినినిలుపదు
ఎంతచెప్పిన విననేవినదు,ఏమిచేసిన మేలుకొనదు
ఏందిరా ఈలోకమన్నది ఈశ్వరా!ఓఈశ్వరా!
ఇంత మిడిజ్ఞానంలో ఉన్నది ఏమిరా?
భగవంతుడు ఒక్కడేనని ఒప్పుకుంటారు
అతనుఉండు స్థానం పైనఅంటే నోచ్చుకుంటారు
అతను,పరమధామవాసియంటే ఒప్పుకుంటారు
ఐనా,నీలోనాలో ఉండునని తెగ నమ్ముతుంటారు
అందరిలో భగవంతుడుంటే పాపకర్మలు జరిగినా?
ఈ ఈతిబాధలు,కష్ట,నష్టములతను అనుభవించునా?
అందరిలో భగవంతుడుంటే పాపకర్మలు జరిగినా?
ఈ ఈతిబాధలు,కష్ట,నష్టములతను అనుభవించునా?
చిలికి వెన్నను చేతికిచ్చిన,ఎంతకూ పట్టించుకోరు.
ఏందిరా ఈలోకమన్నది ఈశ్వరా!ఓఈశ్వరా!
ఇంత మిడిజ్ఞానంలో ఉన్నది ఏమిరా?
ఆత్మలం మనమంటే అందరు ఒప్పుకుంటారు
కానీ,దేహము కాదంటే సందిగ్ధములో పడతారు
శాంతి,సౌఖ్యమునే అందరు కోరుకుంటారు
ఐనీ,మోహ,మమతను వదలమంటే నొచ్చుకుంటారు
ఆత్మలోని మూల గుణములు శాంతి,సౌఖ్యమెగా
మనలను దేహముగ భావిస్తే కలుగును దుక్కశాంతేగా
ఆత్మలోని మూల గుణములు శాంతి,సౌఖ్యమెగా
మనలను దేహముగ భావిస్తే కలుగును దుక్కశాంతేగా
దేహబ్రాంతిని వదలి,ఆత్మిక స్మృతిలోవుంటే సౌఖ్యమేనుగా
ఏందిరా ఈలోకమన్నది ఈశ్వరా!ఓఈశ్వరా!
ఇంత మిడిజ్ఞానంలో ఉన్నది ఏమిరా?
ఇది,ఏందీరా ఈలోకులన్నది ఈశ్వరా!ఓఈశ్వరా!
ఎంత మూఢమతిలో ఉన్నది ఏమిరా?