||సర్కారు బడి ఉన్నది|| లిరికల్ సాంగ్|| #kondapalliarts
KONDAPALLI ARTS
0:00 / 0:00
||సర్కారు బడి ఉన్నది|| లిరికల్ సాంగ్|| #kondapalliarts
13 172 просмотра · 1 год назад
KONDAPALLI ARTS
5,55 тыс. подписчиков
13 172 просмотра · 1 год назад
ప్రభుత్వ పాఠశాలల గొప్పదనం అమలవుతున్న పథకాలు మొదలగు విషయాలను గూర్చి తెలుపుతూ సాగే లిరికల్ సాంగ్..
Heart touching song about government schools.. about Implementation of different schemes in schools..and also about memories of our childhood school days
పల్లవి:
సర్కారు బడి ఉన్నది
మన ఊళ్లో సక్కాని బడి ఉన్నది
ఘనమైన చరితున్నది
మన ఊరి జనము చదువుకున్నది
అవ్వా తాతల కాలం నాటి నుండి
మనకు లక్షణంగా అక్షరాలు నేర్పిన
సర్కారు బడి ఉన్నది
మన ఊళ్లో సక్కాని బడి ఉన్నది
ఘనమైన చరితున్నది
మన ఊరి జనము చదువుకున్నది
చరణం:
పసితనములోన ఆటోల్లో బస్సుల్లో
ప్రమాదకరమైన ప్రయాణము వద్దు
ఆడుతూ పాడుతూ అన్న అక్కల తోటి
ఊళ్లోని బడికెళ్లే ఆనందమే ముద్దు
బట్టీలు పట్టించి బాల్యాన్ని చిదిమేసే
ఒట్టిపోయిన చదువు మనకెందుకోయి
సృజనతో కూడిన సృజనాత్మకత ఉన్న
సర్కారు బడిలోని చదువులే హాయి
వదిలేయి మదిలోంచి ఫీజుల చింత
మన ఊరి మన బడి ఉంది మన చెంత
సర్కారు బడి ఉన్నది
మన ఊళ్లో సక్కాని బడి ఉన్నది
ఘనమైన చరితున్నది
మన ఊరి జనము చదువుకున్నది
చరణం:
చురుకైన పిల్లల్ని ఇరుకిరుకు గదులల్లో
సరుకుల్లాగ చూసే దురవస్థ లేదు
ఐదుగురు టీచర్లు ఐదు తరగతి గదులు
మోడల్ ప్రైమరీ వ్యవస్థ కలదు
బోధనా పద్ధతి తెలియని వ్యక్తుల
మొక్కుబడి చదువుల వ్యాపారమూ కాదు
డిగ్రీలు చేసి డీఎస్సీ రాసిన
శిక్షణ పొందిన గురువులున్నారు
ఇంత మంచి బడి మన ఊళ్లో ఉండగ
అంతంత దూరము ఎందుకు దండగ
సర్కారు బడి ఉన్నది
మన ఊళ్లో సక్కాని బడి ఉన్నది
ఘనమైన చరితున్నది
మన ఊరి జనము చదువుకున్నది
చరణం:
ప్రభుత్వ బడిలో డిజిటల్ బోధన
NMMS IIIT సాధన
ప్రయోగశాలలు గ్రంథాలయము
పెంపొందించును శాస్త్ర విజ్ఞానం
తల్లికి వందనమార్ధిక సాయం
ఆంగ్ల మాధ్యమంతో ఆత్మవిశ్వాసం
పరిశుభ్రమైన టాయిలెట్స్ తో
ఆడపిల్లలకు ఆత్మగౌరవం
విశాలమైన క్రీడా ప్రాంగణం
ప్రశాంతమైన వాతావరణం
సర్కారు బడి ఉన్నది
మన ఊళ్లో సక్కాని బడి ఉన్నది
ఘనమైన చరితున్నది
మన ఊరి జనము చదువుకున్నది
చరణం:
డొక్కా సీతమ్మ భోజన పథకం
ఎంచక్కా పోషకాల ఆహారం
రాగిజావ గుడ్డు చిక్కీలతో పాటు
సన్నబియ్యముతోని చక్కని సాపాటు
పుస్తకాలు బ్యాగు యూనిఫాము బెల్టు
సర్వేపల్లి పేర విద్యామిత్ర కిట్టు
నెలవారి చేసేటి ఆరోగ్య తనిఖీలు
బాలబాలీకాలనొక కంట కనిపెట్టు
ఇన్ని సౌకర్యాలు ఉన్నట్టి మన స్కూలు
అందిపుచ్చుకుంటే అది మనకె మేలు
సర్కారు బడి ఉన్నది
మన ఊళ్లో సక్కాని బడి ఉన్నది
ఘనమైన చరితున్నది
మన ఊరి జనము చదువుకున్నది
చరణం:
బలహీన వర్గాల తలరాత మార్చింది
అన్ని వర్గాలకు అండగా నిలిచింది
ఎందరో తన ఒడిలో ఓనమాలు దిద్ది
ఎంతెంతొ ఎత్తుకు ఎదిగి ఉన్నారు
స్వేచ్ఛతో కూడిన క్రమశిక్షణుoటుంది
హక్కులతో పాటు బాధ్యత చెబుతుంది
పర్యావరణం పైన ప్రేమ పెంచుతుంది
సమాజమూ పట్ల మమకారముంటుంది
సర్వతోముఖమైన అభివృద్ధి మనకు
సర్కారు బడితోనే సాధ్యమవుతుంది.
సర్కారు బడి ఉన్నది
మన ఊళ్లో సక్కాని బడి ఉన్నది
ఘనమైన చరితున్నది
మన ఊరి జనము చదువుకున్నది
అవ్వా తాతల కాలం నాటి నుండి
మనకు లక్షణంగా అక్షరాలు నేర్పిన
సర్కారు బడి ఉన్నది
మన ఊళ్లో స క్కాని బడి ఉన్నది
ఘనమైన చరితున్నది
మన ఊరి జనము చదువుకున్నది
రచన:
కొండపల్లి గౌరునాయుడు (టీచర్)
UTF స్టేట్ కల్చరల్ కమిటీ మెంబర్
జనవిజ్ఞాన వేదిక మన్యం జిల్లా అధ్యక్షులు
రచన & గానం: కొండపల్లి గౌరు నాయుడు 9573380455
||సర్కారు బడి ఉన్నది|| లిరికల్ సాంగ్|| #kondapalliarts
#sarkarubadi
#schoolsongs
#badisong
#schoolsongs
#education
#educationalsong
#motivationalsong
#governmentschoolsong
#latesttelugusongs
#greatnesdofgovtschools
#songaboutschool
#telugusongaboutgovernmentschools
#songaboutgovernmentschoolsintelugu