ప్రేమ బంధం ♥️❤️🔥❤️🔥❤️🔥 full story
సుహనా కథల మాలిక
0:00 / 0:00
ప్రేమ బంధం ♥️❤️🔥❤️🔥❤️🔥 full story
11 931 просмотр · 11 дней назад
సుహనా కథల మాలిక
1,51 тыс. подписчиков
11 931 просмотр · 11 дней назад
ఒక లగ్జరీ హోటల్ వాతావరణం... చుట్టూ ఎంతోమంది మనుషులు, వారి విభిన్న స్వభావాలను గమనిస్తున్నట్లుగా చూస్తోంది ఒక అమ్మాయి. ఆమె సాధారణ ప్లేన్ చూడీదార్ ధరించి ఉంది. ఎంతో ఆకర్షణీయమైన ముఖం ఉన్నా, అందులో ఏదో చిన్న వెలితి. సరిగ్గా గమనిస్తే ఎవరికైనా అది అర్థమవుతుంది.
అప్పుడే గంభీరంగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు ఒక మధ్యవయస్కుడైన వ్యక్తి. అతనిని చూడగానే ఆమె చిన్నగా నవ్వి కుర్చీలో కూర్చుంది. అతనూ ఎదురుగా కూర్చుని ఆమె వైపే కోపంగా చూస్తున్నాడు.
"నన్ను పిలిపించడానికి కారణం ఏంటి బాబాయ్?" అని వణుకుతున్న గొంతుతో అంది రాధిక.
"రాధికా!" అని గంభీరంగా పిలిచారాయన.
"చెప్పండి బాబాయ్..." అని చిన్నగా తల ఊపింది.
"నీకు నేను మంచి చెడు ఎంతో నేర్పించాను. అది కాకుండా నా భార్య, తన అన్నయ్య కొడుకైన 'రామ్'కి ఇచ్చి నీకు పెళ్లి చేసింది. దానికి కారణం ఏంటో నీకు తెలుసు" అనడంతో రాధిక చిన్నగా తల ఊపింది.
"అందుకే నేను ఒక గంభీరమైన నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నా రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది" అనడంతో ఆశ్చర్యంతో అతని వైపు చూసింది.
"ఏంటి బాబాయ్ అది?"
"ప్రపంచం దృష్టిలో ఇప్పటివరకు నువ్వు నా సొంత కూతురిలా పెరిగావు. కానీ నా అన్నయ్య కూతురివి అనే భావన నాకెప్పుడూ లేదు, నిన్ను నా కూతురిగానే చూశాను. అయితే, చిన్నప్పుడే తప్పిపోయిన నా సొంత కూతురు మళ్లీ నా దగ్గరికి వచ్చింది. ఇన్ని రోజులు మేము పడిన కష్టానికి ప్రతిఫలంగా... నువ్వు రామ్‌తో ఉన్న సంబంధాన్ని తెంపుకోవాలి" అని అనడంతో రాధిక ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది.
"ఏంటి బాబాయ్ మాట్లాడుతున్నారు మీరు?"
"అవును, పద్నాలుగు సంవత్సరాల క్రితం జాతరలో తప్పిపోయిన నా కూతురు సంధ్యను వెతికి పట్టుకున్నాం. తను మమ్మల్ని గుర్తుపట్టింది. రెండు రోజుల్లో తను మా ఇంటికి వస్తుంది. ఈ లోగా ఒక నెల రోజుల్లో నువ్వు రామ్‌కి విడాకులు ఇచ్చేసి నీ దారి నువ్వు చూసుకోవాలి. ఇదే ఈ బాబాయ్‌కి నువ్వు ఇచ్చే కానుక" అన్నారాయన.
వెంటనే ఒక కార్డు తీసి టేబుల్‌పై పెడుతూ... "నువ్వు ఒత్తిచేతులతో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ కార్డులో డబ్బులు ఉన్నాయి. చాలా ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే 30 కోట్ల వరకు ఉన్నాయి" అన్నాడు.
రాధిక ఆశగా ఆ కార్డు వైపు చూసింది. "నిజంగా 30 కోట్లు ఉన్నాయా?" అని కళ్లు పెద్దవి చేసి అడిగింది.
సోమనాథం తన వైపు ఒక కుటిలమైన చిరునవ్వు (Evil Smile)తో చూశాడు. "అవును, ఉన్నాయి. నీకు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో. మీకు పెళ్లయి రెండు సంవత్సరాలు దాటింది. మన ఫ్యామిలీ షేర్స్ నిలబడాలంటే ఈ పాటికి నువ్వు పిల్లల్ని కనాలి, కానీ కనలేదు. అందుకే నిన్ను ఆ స్థానం నుంచి తప్పించి, నా సొంత కూతురైన సంధ్యను అక్కడ ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు రామ్‌ను వదిలేసి వెళ్లేపో" అని గంభీరంగా చెప్పాడు.
రాధిక ఏం మాట్లాడాలో అర్థం కాక బికముఖం వేసి చూసింది.
"ఏంటి ఆలోచిస్తున్నావ్?" అని గంభీరంగా అడిగాడు సోమనాథం.
చిన్నగా నవ్వుతూ... "మీరంత త్వరగా వెళ్లమని చెప్తుంటే నేను ఎందుకు వెళ్లను బాబాయ్ గారూ? ఖచ్చితంగా వెళ్ళిపోతాను... కాకపోతే నాకు 30 కోట్లు సరిపోవు, 50 కోట్లు కావాలి" అంది.
"ఏం మాట్లాడుతున్నావ్?" అని సోమనాథం ఆశ్చర్యపోగా...
"అవును, నేను రామ్‌ను వదిలి వెళ్లాలంటే ఖచ్చితంగా 50 కోట్లు కావాలి. అప్పుడే నేను వెళ్తాను" అంది తేల్చిచెప్తూ.
ఆమె వైపు కోపంగా చూస్తూ... "సరే అయితే, 50 కోట్లు నీకు ఇస్తాను. నువ్వు రామ్‌ను వదిలేసి వెళ్ళిపోవాలి" అన్నాడు.
మళ్లీ అదే కుటిల నవ్వుతో తన వైపు చూస్తూ... "అలాగే వదిలేసి వెళ్ళిపోతాను" అని చెప్పి, తన హ్యాండ్ బ్యాగ్, చూడీదార్ సర్దుకుని అక్కడి నుంచి బయలుదేరింది.