Перейти к содержимому

ప్రపంచంలోనే మొట్టమొదటి బ్రహ్మ దేవాలయం!! 800 సంవత్సరాల పురాతన దేవాలయం చుట్టూ అనేక అద్భుత కథలు!!

Praveen Mohan Telugu

0:00 / 0:00

ప్రపంచంలోనే మొట్టమొదటి బ్రహ్మ దేవాలయం!! 800 సంవత్సరాల పురాతన దేవాలయం చుట్టూ అనేక అద్భుత కథలు!!

37 919 просмотров · 4 г. назад
Praveen Mohan Telugu
565 тыс. подписчиков
37 919 просмотров · 4 г. назад
ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - praveenmohantelugu@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   Hey guys, ఈ రోజు మనం కంబోడియాలో ఉన్న 'ట ప్రామ్' అనే గుడికి వెళ్లబోతున్నాం. దీన్ని 12వ శతాబ్దం చివరిలో కట్టారని Archeologistలు అనుకుంటున్నారు, కాబట్టి ఈ గుడి సుమారు 800 సంవత్సరాల పురాతనమైనది. మరి ‘ట ప్రామ్’ అనే పదానికి అర్ధం ఏమై ఉంటుంది? ‘Ta Prohm’ అంటే ancestor brahma అంటే ‘పూర్వపు బ్రహ్మ’ అని అర్ధం, హిందూ సృష్టి కర్త అయినా బ్రహ్మను కంబోడియా ప్రజలు తమ పూర్వికులలో ఒకరిగా భావిస్తారు. కానీ, ఈ గుడి యొక్క అసలైన పేరు రాజ విహార, అంటే సంస్కృతంలో రాజు గారి Rest-House అని అర్ధం. ఈ గుడి రెండు ముఖ్యమైన విషయాలకు పేరు పొందింది, అవి ఏంటంటే ఒకటి ఈ డైనోసార్ యొక్క శిల్పం, ప్రత్యేకంగా ఇది Stegosaurus shapeలో ఉన్న ఒక డైనోసర్, ఇది ఇక్కడున్న గోడలలో ఒకదానిపైన ఉంది, దీని గురించి already నేను full వీడియో చేసి మీకు చూపించాను. రెండవ విషయం ఏంటంటే, ఈ చెట్లే ఎహ్, ఇలాంటి పెద్ద పెద్ద రాక్షస చెట్లు ఈ గుడి మొత్తాన్ని ఆక్రమించాయి అనే చెప్పవచ్చు. నా ఉదేశ్యం ఏంటంటే, ఈ చెట్లు నిజంగా ఇలా పెరిగి ఉన్నదాన్ని, ఇంకా ఈ గుడి మొత్తాన్ని నాశనం చేసే తీరును చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది అసలు ఎలా జరిగుంటుంది? సుమారు 500 సంవత్సరాలకు ముందే కంబోడియా ప్రజలు ఈ మొత్తం నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అందుకే ఈ నగరంలో ఉన్న చాలా గుడులలో ఇలా పొదలు ఇంకా చెట్లు పెరగడం మనం చూస్తున్నాము, కానీ ఈ గుడిలో మొక్కలను ఇంకా పక్షులను ఆకర్షించే విధంగా ఏదో ఒక రకమైన విచిత్రమైన శక్తి ఉంది. అందుకే ఇక్కడ మనం చాలా మొక్కలను, పెద్ద పెద్ద చెట్లను, పక్షులను చూస్తున్నాము. నిజానికి, ఏదో ఒకరోజు ఈ చెట్లన్నీ ఈ గుడి మొత్తాన్ని ఆక్రమించేస్తాయని పురాతన బిల్డర్లు అప్పుడే అంచనా వేసేసారు, అది మాత్రమే కాకుండా futureలో ఈ గుడికి ఏమవుతుందని కూడా ఈ శిల్పాలలో చెక్కారు చూడండి. ఈ గుడి లోపలే చాలా చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి చూడండి, వీటిలో ఒక గుడి లోపలికి వెళ్లి అక్కడ ఏముందని చూద్దాం రండి. ఒకప్పుడు ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉండేవేమో కానీ, ఇప్పుడు పైన ఉన్న ceiling అలానే ఈ గోడలన్నీ కూలిపోయినట్లు మీరే చూడవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్లు నేలపై పడిపోయున్నాయి కాబట్టి, ఒక్కప్పుడు ఇక్కడ ఏముండేదని అసలు guess కూడా చేయలేకపోతున్నాం. దీని side viewని చూడండి, దీన్ని చూస్తుంటే ఒక రథం లాగా ఉంది కదా! ఏదో ఒక సమయంలో ఈ గుడి ఇంకా పక్కనే ఉన్న అడవి నెమ్మదిగా ఎలా కలిసిపోయాయో చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ గుడి అమెరికన్ ప్రజలలో చాలా బాగానే ప్రాచుర్యం పొందింది, అది మాత్రమే కాకుండా, గుడిని full గా ఆక్రమించిన ఈ రాక్షస చెట్లు క్రింద నిల్చోని వాళ్ళు చాలా photosలను కూడా తీసుకుంటున్నారు. Tomb Raider అనే English movieలో ఈ particular locationని ఉపయోగించారు, అంతవరకు ఎవరికీ తెలియని ఈ గుడి, ఆ movie తరువాత ఒక పెద్ద tourist placeగా మారింది. నేడు భారత ప్రభుత్వం restoration project అంటే పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ కోసం kontha amount ని నిధిగా ఇస్తున్నారు, అది మాత్రమే కాకుండా Indian archeology department వాళ్ళు కూడా కాంబోడియా ప్రభుత్వంతో కలిసి, ఈ గుడిలో నాశనమైన, పాడుబడిన పురాతన నిర్మాణాలను బాగుచేస్తూ వస్తున్నారు. మనం ఇప్పుడున్న photosని, పాత photosని compare చేసి చూద్దాం, చెప్పాలంటే వీళ్ళు చాలా బాగానే work చేశారు. ఈ గుడిలో interesting అయినా శిల్పాలు చాలా ఉన్నాయి, కానీ వాటిలో చాలా శిల్పాలు ఈ చెట్ల వల్ల నాశనం అయిపోయాయి. ఈ చెట్టు వేర్లు చూడండి, వీటిని చూస్తుంటే ఒక పెద్ద పాము ఈ గుడి మొత్తాన్ని చుట్టేసినట్టు కనిపిస్తుంది కదా! ఇక్కడ ఈ గోడపైన విచిత్రమైన ఒక బొమ్మను చెక్కారు చూడండి. అసలు ఇది ఏమైయుంటుంది? ఇది ఐదు తలల నాగుపాము, కానీ ఈ బొమ్మలో ఏదో తప్పుగా ఉంది, దాని మిగిలిన శరీరం ఎక్కడ ఉంది?ఈ గోడని బాగా గమనించి చూస్తే, అందులోనే చాలా ఆధారాలు మనకు కనిపిస్తాయి, మీరు guess చేయగలుగుతున్నారా ఇది ఏంటని? దీని కింద పెద్ద గోర్లతో ఒక కాలు ఉంది చూడండి, కానీ పాములకు అసలు కాళ్ళు ఉండవు కదా! అది మాత్రమే కాదు, ఈ రెండు sideలలో, పెద్ద రెక్కలు విరిచి ఉన్నాయి చూడండి. కచ్చితంగా ఆ కాలంలో అద్భుతమైన చెక్కడాన్ని ఇక్కడ చెక్కుంటారు. అది ఏంటీ? ఇది పక్కనే ఉన్న గుడిలో చెక్కిన శిల్పం, ఒకవేళ ఆ శిల్పం ఇదే విధంగా ఉండుండేదేమో. ఈ శిల్పంలో ఉన్నది గరుడ అనే దేవుడు, ఇది ఒక పెద్ద పక్షి, తన రెండు కాళ్లతో, రెండు నాగులను గట్టిగా పట్టుకుని ఉంది. అది మాత్రమే కాకుండా, ఈ నాగుపాముల తోకలను గరుడ పక్షి తన తలకి పైన పట్టుకుని ఉంది. నాగులను హింసించి పీడిస్తున్న ఈ అద్భుతమైన గరుడ శిల్పం ఒకప్పుడు ఈ ట ప్రామ్ గుడిలో ఉందనడంలో ఎలాంటి సందేహమే లేదు. కచ్చితంగా ఇది ఒక అద్భుతమైన శిల్పంగానే ఉండేది, కానీ దురదృష్టవశాత్తు కావాలనే మనుషులు దీన్ని నాశనం చేసారు, కచ్చితంగా ఇది ప్రకృతి ప్రభావం అయితే కాదు. అయితే, గరుడ ఈ నాగులను ఏం చేస్తున్నాడు? మన భారతీయ హిందూ మతంలో ఈ గరుడ కేవలం నాగులను తన చేతులతో పట్టుకున్నట్టు లేదా కొన్ని సార్లు తన ముక్కుతో పట్టుకున్నట్లు చూపించారు. కానీ South East Asiaలో అంటే ఈ కాంబోడియా, థాయిలాండ్ దేశాలలో చూసుకుంటే, ఈ విధంగా గరుడ తన కాళ్లతో నాగుపాము తలని కిందికి పట్టుకొని, నాగుపాము తోకని తన తలకి పైన ఎత్తి పట్టుకున్నట్లు చూపించారు. దీని వెనుక ఉన్న ఒక విచిత్రమైన కథని కంబోడియా ప్రజలు నా దగ్గర చెప్పారు. #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu