తిరుమల నిలయం పరిమళ నాథుడి సన్నిధి
PUTLURU SRI MAREMMA BHAKTHUDU
0:00 / 0:00
తిరుమల నిలయం పరిమళ నాథుడి సన్నిధి
228 просмотров · 2 недели назад
PUTLURU SRI MAREMMA BHAKTHUDU
17 подписчиков
228 просмотров · 2 недели назад
పల్లవి:తిరుమల నిలయం
పరిమళాల నాథుడి సన్నిధి.
చరణం:1
సుస్వరాల సప్తగిరుల నడుమ,
ఎన్నెన్నో ఫల పుష్ప రసభరిత,
రమ్యమైన పరిమళాల కలయికతో,
ఆ ఇరువురి దేవేరులను దేహంపై నిలిపి,
నిత్య కళ్యాణ పరిమళ మూర్తివై వెలిశావు.
(తిరుమల)
చరణం:2
విశ్వ విఖ్యాత నట సార్వభౌమత్వముతో,
దశావతారాలలో ధర్మశ్రేష్టవై వెలుగెత్తి చాటావు,
ప్రఖ్యాత పలువురి భక్తులతో,
పరిపరి విధముల కీర్తింపబడితివి,
అణగారిన అల్పజీవియై నిను శరణు వేడితి.
(తిరుమల)
చరణం:3
చితికిన సంసారంతో మోయలేని
భవసాగర బారముతో ,
వెలలేని జీవితమున ఎనలేని శోకంతో,
పరుగు పరుగున నీ గిరుల వైపు చేరి,
పాహి ప్రభో, విభోయని, శరణు వేడితినయ్య.