CVR శక్తి - వరి నూక ద్వారా కలుపు నివారణ, అధిక దిగుబడి #Chinthala Venkata Reddy #PadalaGoutham
Padala Goutham
0:00 / 0:00
CVR శక్తి - వరి నూక ద్వారా కలుపు నివారణ, అధిక దిగుబడి #Chinthala Venkata Reddy #PadalaGoutham
24 038 просмотров · 8 месяцев назад
Padala Goutham
46,7 тыс. подписчиков
24 038 просмотров · 8 месяцев назад
CVR శక్తి - వరి నూక ద్వారా కలుపు నివారణ, అధిక దిగుబడి #Chinthala Venkata Reddy #PadalaGoutham
******* హెచ్చరిక *******
CVR పద్మశ్రీ శ్రీ చింతల వెంకటరెడ్డి గారి కొన్ని వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన వరి ద్వారా వచ్చిన బియ్యం లో A, C, D విటమిన్లు ఉంటాయి ఈ పద్ధతుల పైన శ్రీ చింతల వెంకటరెడ్డి గారు పేటెంట్ పొంది ఉన్నారు కావున రైతులు వ్యాపార పరంగా కాకుండా తమ ఇంటి అవసరాలకు మాత్రమే పండించుకో గలరని మనవి
*** " CVR శక్తి " పద్ధతి ద్వారా వరి సాగు చేయాలి అంటే తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రీయ వ్యవసాయం మాత్రమే చేయాలి. ఎలాంటి రసాయనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వాడరాదు అలా అయితేనే ఈ " సివిఆర్ శక్తి " పద్ధతి పాటించండి.
@ ఎవరైనా సరే ముందుగా పావు ఎకరం లేదా అర ఎకరం లేదా ఒక ఎకరం మాత్రమే సాగు చేసి చూడండి ఫలితాలు చూసిన తర్వాత రెండవ పంట నుంచి ముందుకు వెళ్ళండి
ముందుగా మడిలో జనుము విత్తనాలు చల్లాలి విత్తనాలు చల్లే ముందు గోరు వెచ్చటి నీటిలో 8 నుండి 12 గంటలు నానబెట్టాలి, పూత సమయంలో అంటే 40 నుండి 45 రోజుల వయసులో మడిలో కలియదున్నాలి
నాటు వేసే సమయంలో ఎకరాకు 200 కిలోల ఆముదము పిండి చల్లాలి
నాటు వేసే రోజు ఎకరాకు 100 కిలోల నూకలు చల్లాలి
తిరిగి 25 నుండి 30 రోజులకు రెండవ దఫాగా 100 కిలోల నూకలు లేదా వడ్లను పొట్టుతో సహా నూకలుగా మార్చి పొలంలో చల్లాలి
వరి పాలు పోసుకునే దశలో ఎకరాకు 75 కిలోల సోయా మరియు 75 కిలోల మక్కజొన్నలు మరీ మెత్తగా కాకుండా ఉప్మా రవ్వ మాదిరి పిండి పట్టించి పొలమంతటా చల్లాలి
శ్రీ చింతల వెంకటరెడ్డి గారు ఈ పద్ధతి ద్వారా ఎకరాకు 2600 కిలోల ధాన్యము దిగుబడి సాధించారు. కానీ వారు 40 రోజుల తర్వాతనే నూకలు చల్లడం జరిగింది. దాని బదులుగా ఇంకా ముందుగా నూకలు చల్లితే ఎక్కువగా పిలకలు రావడమే కాకుండా దిగుబడి బాగుంటుందని చెప్పారు రెండవ సారి కూడా నూకలు చల్లితే ఇంకా బాగుంటుందని అన్నారు. వారి పొలంలో ఎలాంటి తెగుళ్లు చీడపీడలు లేవన్నారు
CVR శక్తి గురించి కింది వీడియో కూడా చూడండి
• వరిలో కలుపు మొగిపురుగు నివారణ 26 క్వింటాళ్...
పడాల గౌతమ్
98497 12341
*** ఫోన్ చేయాలనుకునేవారు ఉదయం 6 7 లేదా రాత్రి 8 9 గంటల మధ్యలో ఫోన్ చేయ గలరులి.
[4/1, 9:17 am] Padala Goutham: • వరి లో సేంద్రీయ పద్ధతి ద్వారా కలుపు నివారణ...
[4/1, 9:18 am] Padala Goutham: • వరిలో కలుపు మొగిపురుగు నివారణ 26 క్వింటాళ్...
[4/1, 9:19 am] Padala Goutham: • CVR శక్తి - వరి నూక ద్వారా కలుపు నివారణ, అ...