సంఘములో అభరణములు ఎందుకు పెట్టుకోకూడదు...? || Why We Do Not Wear Ornaments in Church? || Ps TJS Garu
Pastor Pavan Babu - EAM Church
0:00 / 0:00
సంఘములో అభరణములు ఎందుకు పెట్టుకోకూడదు...? || Why We Do Not Wear Ornaments in Church? || Ps TJS Garu
344 690 просмотров · 7 лет назад
Pastor Pavan Babu - EAM Church
41,1 тыс. подписчиков
344 690 просмотров · 7 лет назад
ప్రభువు రాకడలో ఎత్తబడలంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. సంపూర్ణత కొరకు ఈ లోకములో మనము వైరాగ్యముతో కూడిన భక్తిని చేయాలి.
ఈ సందేశం కేవలం స్త్రీల కొరకు మాత్రమే కాదు, పురుషులకు కూడా. అన్యదేవతలు, దేవుళ్ళు ఈ విధమైన అలంకరణ కలిగి ఉండగా... దేవుని పోలికలో చేయబడిన మనం దేవుని వలే ఉండాలి.
ఎఫెసీయులకు 4: 12
" క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను."
నిర్గమ.33.3,4 లో మీరు లోబడనొల్లని ప్రజలు నేను మీతోకూడా రాను అని చెప్పినప్పినడు...
" ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ' ఎవడును ' ఆభరణములను ధరించుకొనలేదు."
ఇక్కడ పురుషులు కూడా ఆభరణాలు తీసివేశారు. అందుకే ఎవడు అభరణములు ధరించలేదు.
నేను మీతో రావాలంటే మీరు ఆభరణాలు తీసేయాలి అని దేవుడు ఖచ్చితంగా చెబుతుంటే "ఫర్వాలేదులే కొంచెం పెట్టుకోవచ్చు" అనుకోవటం అవివేకం. విషం కొంచెం అయినా ప్రాణం తీయక మానదు.
పొరుగువారి వస్తువులు మన ఇంట్లో ఉంటే వారు అవి తీసుకొనేవరకు మన ఇంటికి వస్తూనే ఉంటారు. అలాగే ఆభరణాలు సాతానుకు సంబంధించినవి ఆవి మన వొంటి మీద ఉన్నంత వరకు వాడు మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వస్తూనే ఉంటాడు.
అలా వస్తే ఉరుకుంటాడా... అసలే వాడు దొంగ, దోచుకునేవాడు, అబద్దికుడు, నరహంతుకుడు, తనకు సమయం కొంచెమే అని ఎవరిని మ్రింగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. నరకానికి ఈడ్చుకెళ్ళటాని మనల్ని నాశనం చేయక ఊరుకుంటాడా... ఊరుకోడు.
అందుకే ప్రభువు మన క్షేమాన్ని కోరి సాతాను మీతో వస్తే నేను మీతో రాను అంటున్నాడు.
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేదు. ఒకని ప్రేమిస్తే మరొకరిని తృణీకరించాలి.
నాకు ఇద్దరు కావాలి అంటే కుదరదు. కనుక మీరు ఎవరిని ప్రేమిస్తారో కోరుకోండి.
మీ క్షేమం కోరే ప్రభువా...
మీ నాశనాన్ని కోరే సాతానునా...
*** మీ చేతుల్లోనే ఉంది *****
ద్వితి. 30: 19
" నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను."