Aditya Hrudayam - ఆదిత్య హృదయం
giftforever
0:00 / 0:00
Aditya Hrudayam - ఆదిత్య హృదయం
37 просмотров · 2 недели назад
giftforever
393 подписчика
37 просмотров · 2 недели назад
ఆదిత్య హృదయం
అందరికీ ప్రత్యక్ష దైవం,
అందరినీ ఈక్షించి రక్షించు దైవం,
ఆదిదేవ పరమశక్తి - ఈ దైవం,
ఆర్యాదేవి పరాశక్తి - ఈ దైవం.
ఇదిగో ఇతడే మన దేవుడు
ఇలలో మనకు కడు పూజ్యుడు,
ఆదిత్యుడు, సవితా, సూర్యుడు,
సురాసురులకూ పరమ పూజ్యుడు.
ఇతడే బ్రహ్మా,
ఇతడే విష్ణుడు,
ఇతడే శివుడు,
ఇతడే గురుడు,
ఇతడే ఘనుడు,
ఇతడే యముడు,
ఇతడే వంద్యుడు,
ఇతడే స్కందుడు.
ఇతడే ఇంద్రుడు,
దయా సాంద్రుడు,
అగ్నిదేవుడు,
వాయుదేవుడు,
ప్రాణ దేవుడు,
ప్రజాపతి సముడు,
ఇతడే వరుణుడు
ఇతడే అరుణుడు,
సర్వ శాస్త్ర
విశారదుడు,
ఋగ్యజుస్సామవేద
కోవిదుడు,
సర్వ శత్రు
వినాశకుడు,
ఆయురారోగ్యైశ్వర్య
దాయకుడు.
చింతా శోక భయ
ప్రశమనుడు,
చింతిత కాముక
ఫలప్రదాయకుడు,
క్రాంతి ప్రేరకుడు,
భ్రాంతి వారకుడు,
కాంతి కారకుడు,
శాంతి దాయకుడు.
హిమఘ్నుడు,
తమోఘ్నుడు,
శత్రుఘ్నుడు,
కృతఘ్నఘ్నుడు,
ఉగ్రుడు, వీరుడు,
సారంగుడు,
జయభద్రుడు,
ప్రళయ మార్తాండుడు,
మన అజ్ఞాన నాశకుడు,
ఘనాన్ధకార విచ్ఛేదకుడు,
ధర్మ ప్రేరకుడు,
కర్మ చోదకుడు, యజ్ఞ సాధకుడు
యజ్ఞ పూరకుడు
త్రికాలజ్ఞుడు,
త్రిలోకేశుడు,
త్రిమూర్తి స్వరూపుడు,
సృష్టి స్థితి లయ కారుడు,
సత్త్వరజస్తమో దూరుడు.
గ్రహ నక్షత్ర తారాధిపతి,
సహస్ర కిరణ కాంతిమతి,
సర్వ తేజముల పుణ్యకృతి,
జ్యోతిర్గణములకెల్ల మహద్ద్యుతి.
కష్ట కాలంలో,
క్లిష్ట సమయంలో,
అడవుల్లో,
అతి కఠిన ఘడియల్లో,
స్మరిస్తే సద్య బలమిచ్చునది,
జపిస్తే విజయ ఫలమిచ్చునది.
అగస్త్యమునివరుడు పలికినది,
అవనిజాధవుడు కొలిచినది,
అసురాంతకమై నిలిచినది,
అభయ కవచమై వెలసినది.
గాయత్రీ మంత్ర పర దైవతమిది -
అతి పవిత్ర ఆదిత్య హృదయమిది x2
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ ।
జయావహం జపేన్నిత్యం
అక్షయ్యం పరమం శివమ్ ॥
సర్వమంగళమాంగల్యం
సర్వపాపప్రణాశనమ్ ।
చింతాశోకప్రశమనం
ఆయుర్వర్ధనముత్తమమ్ ॥