TOP9 ET: డ్రాగన్ కోసం రంగలోకి దిగిన లూగర్..| రాకా కోసం.. ఈ సారి రెమ్యునరేషన్ కాదు.. అంతకు మించి..
TV9 Entertainment
0:00 / 0:00
TOP9 ET: డ్రాగన్ కోసం రంగలోకి దిగిన లూగర్..| రాకా కోసం.. ఈ సారి రెమ్యునరేషన్ కాదు.. అంతకు మించి..
10 936 просмотров · 7 дней назад
TV9 Entertainment
3,03 млн подписчиков
10 936 просмотров · 7 дней назад
TOP9 ET: డ్రాగన్ కోసం రంగలోకి దిగిన లూగర్..| రాకా కోసం.. ఈ సారి రెమ్యునరేషన్ కాదు.. అంతకు మించి.. - TV9
#top9et #ntr #alluarjun #tv9entertainment
డ్రాగన్ కోసం లూగర్ రంగలోకి దిగాడు. ఎస్! ఇటీవల ఎన్టీఆర్‌కు డ్రాగన్ సినిమా షూటింగ్‌లో గాయమైన సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ చేశారు వైద్యులు. అలాగే.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో డ్రాగన్ షూటింగ్ డిలే అవుతూ వస్తోందనే టాక్ వినిపిస్తునే ఉంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు. కానీ లేటెస్ట్‌గా తారక్ ఈ సినిమా సెట్స్‌లోకి అడుపెట్టినట్టుగా తెలుస్తోంది. షోల్డర్ సర్జరీ నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. డ్రాగన్ షూటింగ్‌లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారట. తాజా సమాచారం ప్రకారం, రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ముందుగా కీలకమైన టాకీ పార్ట్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. టాకీ పోర్షన్ పూర్తయిన తర్వాత, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మాస్ మేనియాను నెక్స్ట్ లెవెల్‌లో చూపించేలా ఈ యాక్షన్ బ్లాక్స్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫ్టర్ RRR ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్‌లో పెరిగిపోయింది. తారక్ అటైర్, యాక్టింగ్ అండ్ డ్యాన్స్ ... నార్త్ ఆడియన్స్‌ను స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ మేకర్స్ అండ్ యాక్టర్స్ కూడా తారక్ వెంట పడుతున్నారు. మన హీరో సినిమాల్లో యాక్ట్ చేసేందుకు కాల్ చేసుడే ఆలస్యం అన్నట్టుగా వచ్చి వాలిపోతున్నారు. డ్రాగన్ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ కీ రోల్ చేస్తున్నారు. ఇక ఈయనకి తోడు.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్‌గా తారక్ కోసమే డ్రాగన్ సినిమాలో విలన్‌గా చేస్తున్నట్టు తెలుస్తోంది.
అన్ని సినిమాల్లా కాకుండా రాకా కోసం బన్నీ ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్‌కు బదులుగా ప్రాఫిట్ షేరింగ్ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లాభాల్లో వాటా తీసుకునే విధంగా ఆయన రెమ్యునరేషన్‌ను ఫిక్స్ చేసుకున్నారట. ఈ మూవీ భారీ సక్సెస్ సాధిస్తే బన్నీకి ఏకంగా రూ.300 కోట్ల వరకు అందే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ మొత్తం అధికారికంగా ధృవీకరించబడలేదు. మరోవైపు ‘రాకా’ బడ్జెట్ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని టాక్. ఇందులో దాదాపు 50 శాతం షూటింగ్ దశలోనే ఖర్చయిందనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో మేకర్స్‌పై ఆర్థిక భారం తగ్గించేందుకు అల్లు అర్జున్ ప్రాఫిట్ షేరింగ్‌కు మొగ్గుచూపినట్లు సమాచారం.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
Credit: #NewsUpdates | #SateeshChandra /Producer | #TV9D