ధరణిలో తనువు వెయ్యి ఏళ్లు నిల్వ బోదు | గానం బాలరాజు గారు | Mata Bhavani MataBhajan @ Bhajana TV
Bhajana TV
0:00 / 0:00
ధరణిలో తనువు వెయ్యి ఏళ్లు నిల్వ బోదు | గానం బాలరాజు గారు | Mata Bhavani MataBhajan @ Bhajana TV
686 352 просмотра · 3 г. назад
Bhajana TV
18,4 тыс. подписчиков
686 352 просмотра · 3 г. назад
ధరణిలో తనువు వెయ్యి ఏళ్లు నిల్వ బోదు | గానం బాలరాజు గారు | Mata Bhavani MataBhajan @ Bhajana TV
hi friends this is totally devotional songs in this channel please subscribe and support this channel
పద్యం:
సీ. ధరణిలో వేయేండ్లు - తనువు నిల్వగబోదు ధన మెప్పటికి శాశ్వ తంబు గాదు దారసుతాదులు తనవెంట రాలేరు భ్రుత్యులు మృతిని ద - ప్పింపలేరు. బంధుజాలము తన్ను - బ్రతికించుకోలేరు బలపరాక్రమ మేమి - పనికి రాదు ఘనమైన సకల భా - గ్యం బెంత గల్గిన గోచిమాత్రంబైన - గొనుచుబోడు తే. వెట్టి కుక్కల భ్రమలన్ని - విడిచి నిన్ను భజన జేసెడివారికి - బరమసుఖము. భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస | దుష్టసంహార | నరసింహ దురితదూర | -
తాత్పర్యం:
ఓ జగన్నాథా! పరమాత్మా! నరశింహా! ఈ అశాశ్వతమైన శరీరము వేయేండ్లు భూమిపై
నిల్వజాలదు. ధనమెప్పటికి స్థిరముగాదు. భార్యాబిడ్డలు తన వెంటరారు. భృత్యులు మృతువును తప్పించలేరు. బందువులు బ్రతికించలేరు. బలపరాక్రమములు పనికిరావు గొప్ప సంపదకల్గియున్నను ఇసుమంతైనా వెంటగొని పోడు. వెఱికుక్కలవంటి అనగా పనికిమాలిన తలంపులు(ఆలోచనలు) మాని నిన్నే మనఃస్ఫూర్తిగా భజించెడు వారికి ఇహపరసౌఖ్యములిచ్చి కాపాడే దాతవు నీవేగదా!
నీవైన దయ చూడవమ్మా లోక- పావని నను బ్రోవవమ్మ
ఈ వేళ మీ పాద -సేవ జేసిన వారి
కావరించి బ్రోవ వమ్మ దయాంబుది. ||. నీవైన ||
తల్లి కైనా మిక్కిలేరి కల్పవల్లివి ధర్మానుసారీ
ముల్లోకముల వారు ముని జనాదులెల్ల
కొల్లలుగా నిన్ను కొనియాడు చిందురు ||. నీవైన||
రాముని పట్టంపురాణీ వర రాజిత ఘన నీలవేణి
నీ మాయ దెలియ నే ఎంతటి వాడను
భామ లాలమా నా నోము ఫలము నీవే ||. నీవైన ||
శరణు జేసెద భూమితనయా భక్త వరదాయి వమ్మ సద్వినయా
తరుణీ మోముల పురి దాముని సతివయ్య
ధరణిలో వెంకట దాసు నేలవమ్మ. ||. నీవైన ||