Перейти к содержимому

బామ్మల కాలం నాటి దోసకాయ చింతకాయల రొటీ పచ్చడి

Seetha Veg Vantalu

0:00 / 0:00

బామ్మల కాలం నాటి దోసకాయ చింతకాయల రొటీ పచ్చడి

596 просмотров · 2 нед. назад
Seetha Veg Vantalu
716 подписчиков
596 просмотров · 2 нед. назад
ప్రాచీన దోసకాయ చింతకాయల రొటీ పచ్చడి Ingredients: 1/4కేజీ దోసకాయ, 50గ్రామ్స్ చిన్న చింతకాయలు, 6 ఎండుమిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు, ఆవాలు పోపు దినుసులు: మినపప్పు,మెంతులు,జీలకర్ర, ఆవాలు,ఇంగువ,ఎండుమిర్చి, నూనె కొత్తిమీర, పసుపు, ఉప్పు ముందుగా తీసుకొన్న దోసకాయను, చిన్న చింతకాయలను శుభ్రం గా క్లీన్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. దోసకాయను పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలగ కట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి, అలానే దోసకాయలోని గింజలను ప్రక్కన పెట్టుకోవాలి. చింతకాయలను కూడా చిన్న ముక్కలగ కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ స్టవ్ మీద పెట్టి కొద్దిగ నూనె వేసి మినపప్పు,మెంతులు,జీలకర్ర,ఆవాలు వేసి వేయించి తీసుకొన్న ఎండుమిర్చి వేసి వేయించి అలానే ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పోపు చల్లార్చుకోవాలి. పోపు చల్లారే లోపున ఒక జార్లో చింతకాయ ముక్కలను, ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేసి అలానే దోసకాయ గింజలను వేసి కొద్దిగ గ్రైండ్ చేసి దాంట్లోనే చల్లారిన పోపు కొద్దిగ ఎండుమిరపకాయలను వేసి మెత్తగా గ్రైండ్ చేసి తరువాత చిన్నగా కట్ చేసుకొన్న దోసకాయ ముక్కలను వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి ఒక బౌల్ లోకి తీసి మిగిలిన పోపు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవాలి.