Перейти к содержимому

(Re) Marriages for Veterans | A Retired Teacher Running Matrimony In Telugu States |#IdiSangathi

ETV Andhra Pradesh

0:00 / 0:00

(Re) Marriages for Veterans | A Retired Teacher Running Matrimony In Telugu States |#IdiSangathi

304 501 просмотр · 7 л. назад
ETV Andhra Pradesh
8,12 млн подписчиков
304 501 просмотр · 7 л. назад
ఎన్నో పున్నములు చూసిన అనుభవం... ఎంతో జీవితాన్ని ఆస్వాదించిన వయస్సు వృద్ధులది. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ... భవసాగరాన్ని ఈదారు. అయితే జీవిత చరమాంకంలో వారిలో ఏ ఒక్కరు దూరమైనా... జీవితం దుర్భరంగా మారుతోంది. అప్పటి వరకు జంటగా ఉన్న వారి దాంపత్యం.. ముక్కలవడంతో చలించిపోతున్నారు. పిల్లలున్నారు కదా అనే ధైర్యంతో అడుగేస్తే... ఎదిగిన బిడ్డలు ఎవరికి వారే ఎగిరిపోతున్నారు. ఒంటరి పక్షుల్లా అల్లాడే ఆ ముసలి ప్రాణాలు... అనాథలుగా ఆశ్రమాల్లో భారంగా జీవిస్తున్నారు. నిత్యం జీవిత భాగస్వామి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తూ మనో వేదనకు గురవుతున్నారు. అలాంటి వయో వృద్ధులకు అండగా నిలుస్తూ కొత్త జీవితానికి దారి చూపిస్తున్నారు ఓ విశ్రాంత ఉపాధ్యాయురాలు. భర్త చనిపోయిన భార్యలకు, భార్య దూరమైన భర్తలకు మళ్లీ పెళ్లి చేస్తూ... వివాహ బంధానికి కొత్త భాష్యం చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 150కిపైగా వివాహాలు చేసి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు