Перейти к содержимому

తల్లి యొక్క నిర్మలములునైన సన్నపు నారబట్టలుగా మారుదాం | దేవుని సంఘము

World Mission Society Church of God / Global

0:00 / 0:00

తల్లి యొక్క నిర్మలములునైన సన్నపు నారబట్టలుగా మారుదాం | దేవుని సంఘము

4 607 просмотров · 10 мес. назад
World Mission Society Church of God / Global
148 тыс. подписчиков
4 607 просмотров · 10 мес. назад
పెండ్లి భోజనం వద్ద గొఱ్ఱెపిల్ల యొక్క పెండ్లికుమార్తె నిర్మలములునైన సన్నపు నారబట్టలు పరిశుద్ధుల యొక్క నీతివంతమైన క్రియలను సూచిస్తుంది బాప్తిస్మము ద్వారా మానవాళి గత పాపాలన్నిటినీ మరియు పాపపు స్వభావాలన్నిటినీ కడిగివేసి నీతి క్రియల ద్వారా క్రొత్తగా జన్మించినప్పుడు, వారు పెండ్లికుమార్తె అయిన పరలోక తల్లి యొక్క అందమైన నారబట్టగా మారి, పరలోక రాజ్యంలో రాజరిక యాజకులుగా నిత్య మహిమను ఆనందించెదరు. రాజకుమారులు మరియు రాకుమార్తెలు పరలోక రాజ్యంలో దేవుని యొక్క వారసత్వమును స్వతంత్రించుకొనుటకు ఏ సద్గుణాలు అవసరము? పరలోకంలో రాజరిక యాజకులుగా మారుటకు, ఒకరు పరిశుద్ధగ్రంథం ద్వారా దేవుని బోధనలను పొందుకోవలెను. దేవుని సంఘ సభ్యులు విశ్రాంతి దినము మరియు పస్కాను ఆచరించడమే కాక, “ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండండి, ఒకరినొకరు ప్రేమిస్తూ, మరియు క్రొత్త స్వభావాన్ని ధరించండి” అని చెప్పిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి బోధనలను కూడా తమ హృదయాలపై లిఖించుకొని, మంచి క్రియల ద్వారా సర్వలోకమునకు దేవుని మహిమను బయలుపరుస్తూ, వాటిని ఆచరణలో పెట్టుటారు. ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు. ప్రకటన 19:7-8 శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. మత్తయి 5:20 [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com