చిలకలపూడి పోలీసులు వేధిస్తున్నారు | AP DGPకి దివ్యాంగ మహిళా సామాజిక కార్యకర్త ఫిర్యాదు
SPANDANA NEWS
0:00 / 0:00
చిలకలపూడి పోలీసులు వేధిస్తున్నారు | AP DGPకి దివ్యాంగ మహిళా సామాజిక కార్యకర్త ఫిర్యాదు
81 просмотр · 1 дн. назад
SPANDANA NEWS
4,93 тыс. подписчиков
81 просмотр · 1 дн. назад
#chilakalapudi
#apdgp
#womencomplaint
#latestnews
#andhrapradesh
#spandananews
తనపై చిలకలపూడి పోలీసులు అక్రమంగా తప్పుడు కేసులు బనాయించి, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని పేర్కొంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన మహిళా సామాజిక కార్యకర్త అమ్మిరెడ్డి రజని శుక్రవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 90 శాతం శారీరక వైకల్యం కలిగిన తాను ‘హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా’ నేషనల్ ఉమెన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ఎందరో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి కలిపానని, సమాజ సేవకుగా పలు అవార్డులు కూడా అందుకున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే ఓ కుటుంబ వివాద కౌన్సిలింగ్ వ్యవహారంలో చిలకలపూడి పోలీసులు తన సంస్థకు అనుమతులు లేవంటూ తప్పుడు ప్రచారం చేశారని, ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా బూటు కాళ్లతో తన పూజా గదిలోకి ప్రవేశించి సీసీ కెమెరా డీవీఆర్‌తో పాటు మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీల్ ఛైర్ కే పరిమితమైన తనను అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచిన సమయంలో వికలాంగుల హక్కుల చట్టం (RPwD Act) నిబంధనలను, కోర్టు మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించారు. కనీసం వాష్ రూమ్‌కు వెళ్లేందుకు కూడా నిరాకరించి తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తన బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేశారని వినతి పత్రంలో పేర్కొన్నారు. చిలకలపూడి పోలీసుల నుండి తనకు, తన సిబ్బందికి ప్రాణభయం ఉందని, ఈ అక్రమ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే తన అకౌంట్లను అన్‌ఫ్రీజ్ చేసి తనకు రక్షణ కల్పించాలని రజని డీజీపీని వేడుకున్నారు.