Перейти к содержимому

Podili Famous Chenchaiah Ragi Sangati Kodikura | Traditional Food| Chicken Curry | Podili| Food Book

Food Book

0:00 / 0:00

Podili Famous Chenchaiah Ragi Sangati Kodikura | Traditional Food| Chicken Curry | Podili| Food Book

302 307 просмотров · 6 мес. назад
Food Book
194 тыс. подписчиков
302 307 просмотров · 6 мес. назад
పాతకాలపు పద్ధతులతో, అచ్చమైన పల్లె రుచులను అందిస్తున్న ఆహారశాల పొదిలిలోని చెంచయ్య గారి రాగి సంగటి హోటల్' ఇక్కడి వంట విధానం, అక్కడి పనిముట్లు చూస్తే... ముఖ్యంగా కనుమరుగవుతున్న రోలు, తిరగలి లాంటివి చూస్తుంటే, అలనాటి మన పల్లె సంస్కృతి ఇక్కడ కొలువుదీరినట్లు అనిపిస్తుంది. తొలుత వాకిట కల్లాపి చల్లి, తీరైన ముగ్గులు వేశారు. ఆ దృశ్యమే ఆత్మీయ ఆహ్వానంలా అనిపిస్తుంది. సంగటి కోసం రాగులు, రొట్టెల కోసం సజ్జలు కొనుగోలు చేసి.. వాటిని శుభ్రంగా విసురుకొని తిరగలిపై పిండి సిద్ధం చేసుకుంటారు. ఆ పాతకాలపు కమ్మదనం ఎక్కడా తగ్గకూడదన్న ఉద్దేశంతో ఇప్పటికీ వీరు పచ్చళ్లను రోట్లోనే నూరుతున్నారు. శ్రమకు వెనుకాడకుండా అప్పటికప్పుడు రోకటితో కచ్చాపచ్చాగా దంచిన రెండు రకాల పచ్చళ్లను సంగటి, రొట్టెల్లోకి అందిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. పిండి, పచ్చళ్ళ తయారీనే కాదు.. వంట కూడా పాత పద్ధతిలోనే సాగుతుంది. ఇక్కడ వంటంతా కట్టెల పొయ్యి మీదే. కట్టెల మంట మీద నిదానంగా ఉడికే కూరలకు వచ్చే ఆ కమ్మని రుచి, ఆధునిక పొయ్యిల మీద వండితే రాదు కదా. రాగి సంగటి, సజ్జ రొట్టెతో పాటు... కూరగాయలు కలిపిన చింతకాయ పచ్చడి, గోంగూర, మునక్కాయ కూర, కోడికూర వడ్డించారు. చింతకాయ పచ్చడి పులుపు రొట్టెలోకి బాగా కుదిరింది. సంగటిలోకి గోంగూర, కట్టెల పొయ్యి మీద ఉడికిన మునక్కాయ పులుసు కమ్మగా ఉన్నాయి. మంటపై నిదానంగా ఉడకడం వల్ల ఉప్పుకారం బాగా పట్టిన కోడికూర... రొట్టె, సంగటి రెండింటిలోనూ చాలా బాగుంది. గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.