నన్నెంతగా ప్రేమించితివో | Nannethaga Preminchitivo | Telugu Christian Song | Telugu Jesus Song
Piyu Worship Studio
0:00 / 0:00
నన్నెంతగా ప్రేమించితివో | Nannethaga Preminchitivo | Telugu Christian Song | Telugu Jesus Song
5 264 просмотра · 11 дней назад
Piyu Worship Studio
35,8 тыс. подписчиков
5 264 просмотра · 11 дней назад
నన్నెంతగా ప్రేమించితివో | Nannethaga Preminchitivo | Telugu Christian Song | Telugu Jesus Song
Top 10 Telugu Christian Songs:
• Latest Telugu Christian Worship Songs | Pl...
• Best Telugu Jesus Songs | Jukebox Playlist...
• Non-Stop Jesus Songs Playlist | Telugu Chr...
• ఈస్టర్ పునరుద్దరణ జయ గీతాలు | Telugu Easte...
• నీవు చేసిన ఉపకారములకు | Neevu Chesina Upak...
• నిను మాత్రమే నే నమ్మానయా | Ninu Matrame Ne...
• దీవించావే సమృద్ధిగా - Deevinchave samruddi...
• జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా | Jyothirma...
• ఇదిగో దేవా నా జీవితం | Idigo Devaa Naa Jee...
• గతకాలమంత నీ నీడలోన | Gathakaalamantha Nee ...
Lyricsist: Joshua Shaik
నన్నెంతగా ప్రేమించితివో అనే ఈ Telugu Christian Song ద్వారా దేవుని అపారమైన ప్రేమను, ఆయన కృపను అనుభవించండి.
ఈ వీడియోలో యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేసే అద్భుతమైన పాటను మరియు దానికి సంబంధించిన దృశ్యాలను చూడవచ్చు. ప్రతి విశ్వాసికి దేవుని సన్నిధిని గుర్తుచేసే ఈ Telugu Jesus Song మీ హృదయానికి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.
స్క్రీన్ మీద కనిపిస్తున్న Christian lyrics చదువుతూ మీరు కూడా ఈ కీర్తనలో ఏకీభవించండి. దేవుని వాక్యం మరియు ఆయన ప్రేమను చాటిచెప్పే ఈ Telugu devotional గీతం మీ ఆత్మీయ ప్రయాణానికి తోడుగా ఉంటుంది.
మరిన్ని ఆత్మీయ పాటల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రయిబ్ చేసుకోండి. ఈ పాట మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి.
Lyrics:
నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా – నే చెప్పగలనా
దాయనా – నే దాయగలనా (2)
అయ్యా… నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)
ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||
ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||