Перейти к содержимому

ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది Enta bhagyame talli

Sreeradha Valiveti

0:00 / 0:00

ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది Enta bhagyame talli

10 059 просмотров · 2 г. назад
Sreeradha Valiveti
2,49 тыс. подписчиков
10 059 просмотров · 2 г. назад
రచన.. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ http://aananda-lahari.blogspot.com/20... ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది ||2|| అల్లిబిల్లి పలుకగలుగు వారలంతా అంటినారు గాదె వాణినెంతో కొంత ||2|| బ్రహ్మకింతే భాగ్యమేమి చెపుదుమింక అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా ||2|| కాసు కంట జూడగలుగు వారలంతా కలిగినారు గాదె లక్ష్మినెంతో కొంత ||2|| హరికి ఇంతే భాగ్యమేమి చెపుదుమింక అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా ||2|| నహుషుడొకడు కబురు పంపి పిలిచినంత. ఇంకెగాదె శచి గొప్పలు ఎంతో కొంత ||2|| ఇంద్రు భాగ్యమింతే ఏమి చెపుదుమింక అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా ||2|| మాటకందవమ్మ నీవు మనసుకందవు వేద తతులకైన నీవు పట్టు చిక్కవు ||2|| ఎవ్వరమ్మ నిన్ను అందగలిగినారు శివుడొక్కడే నిన్నొడిసి పట్టినాడు ||2|| లోకమ్మున విడివడని జంట ఉన్నదా మీ జంటకు ఎపుడైన ఎడము ఉన్నదా ||2|| అవునమ్మా ఈ భాగ్యము శివుడే నోచెను సచ్చిదానంద భావద్వయ పదము దోచెను ||2||