అప్పులు, డబ్బు సమస్యలు తీరాలంటే ఐశ్వర్య దీపం ఇలా పెట్టండి | Aishwarya Deepam Benefits
RV sister's
0:00 / 0:00
అప్పులు, డబ్బు సమస్యలు తీరాలంటే ఐశ్వర్య దీపం ఇలా పెట్టండి | Aishwarya Deepam Benefits
2 120 просмотров · 1 месяц назад
RV sister's
487 подписчиков
2 120 просмотров · 1 месяц назад
శ్రీ మహాలక్ష్మీ నమః 🙏
ఇంట్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా? అప్పుల బాధలు వేధిస్తున్నాయా? అయితే ఐశ్వర్య దీపం మీ సమస్యలకు పరిష్కారం.
ఈ వీడియోలో ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి, దాని నియమాలు, లాభాలు పూర్తిగా తెలుసుకుందాం.
ఐశ్వర్య దీపం పెట్టడానికి కావాల్సినవి:
1. మట్టి ప్రమిద లేదా వెండి కుందులు - 2 2. ఆవు నెయ్యి 3. బియ్యం పిండితో చేసిన వత్తులు / ఎర్రటి వత్తులు 4. పసుపు, కుంకుమ, అక్షింతలు 5. లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు
ఐశ్వర్య దీపం పెట్టే విధానం:
శుక్రవారం సాయంత్రం స్నానం చేసి, పూజా మందిరాన్ని శుభ్రం చేసి, ఒక పీట మీద బియ్యం పోసి దానిపై 2 ప్రమిదలలో నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఒక దీపం లక్ష్మీదేవికి, ఇంకొకటి విష్ణుమూర్తికి సంకేతం. దీపం వెలిగించేటప్పుడు "ఓం శ్రీం మహాలక్ష్మీ నమః" అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
ఎప్పుడు పెట్టాలి?
ప్రతి శుక్రవారం, పౌర్ణమి రోజు, మరియు ధన త్రయోదశి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత పెడితే చాలా మంచిది.
పాటించాల్సిన ముఖ్య నియమాలు:
• దీపం పెట్టాక ఆ ప్రమిదలను కదపకూడదు • దీపం కొండెక్కే వరకు ఇంటి తలుపులు మూయకూడదు • ఈ దీపం పెట్టిన రోజున ఇంట్లో గొడవలు పడకూడదు
ఈ దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, డబ్బు నిలుస్తుంది.
వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ లో అడగండి.#AishwaryaDeepam #LakshmiDeepam #AishwaryaDeepamElaPettali #FridayPooja #LakshmiPoojaTelugu #MoneyTipsTelugu #TeluguBhakti #DeepamPooja #AishwaryaLakshmi #DhanaLakshmi #BhaktiVideos #PoojaVidhanam