Ella Lokamulavari Annamayya sankeertana lyrics meaning
Srinivasa Babu K
0:00 / 0:00
Ella Lokamulavari Annamayya sankeertana lyrics meaning
1 966 просмотров · 3 года назад
Srinivasa Babu K
1,45 тыс. подписчиков
1 966 просмотров · 3 года назад
ఎల్ల లోకముల.. .
భావము:
శ్రీ వేంకటేశ్వరుడు కొండకోనల్లో ఉండే స్వామిపుష్కరిణి సమీపానగల బంగారుదేవాలయంలో అందమైన పద్మావతి యొక్క బిగి కౌగిటిలో నుండి లోకాలు ఏలే దేవుడు. నాల్గు చేతులతో, నవ్వురాజిల్లే ముఖంతో, శంఖ చక్రాల శోభతో, మింటికి మంటికి ఏకంగా ఉన్న రూపంతో, భక్తుల కోరిక లీడేరుస్తూన్న దేవుడు. నానావిధరుచులతో నైవేద్యాలు ఆరగిస్తూ, పలురకాల పూలపూజలు అందు కుంటూ వేంకటా చలమే స్థానంగా ప్రకాశించే దేవుడు. దేవతలలో ఇతడు సాటిలేని దేవుడు.
(భావ మూలం: విద్వాన్ ముడివర్తి కొండ మాచార్యుల
వారి అమృత సారము)
అన్నమయ్య సంకీర్తన సంఖ్య 359 సంపుటం 4
గానము: శ్రీ A శబరీ గిరీష్ గారు
ఎల్లలోకములవారి కేలిక దానే
కొల్లగా వరములిచ్చే గురుతైన దైవము //పల్లవి//
కొండల కోనల లోన కోనేటి సరిదండ
మెండైన బంగారు మేడలలోన
నిండు జవ్వనము తోడి నెలఁత కౌఁగిటలోన
వుండి జగమెల్ల నేలీ నుద్దండ దైవము //ఎల్ల//
నాలుగు చేతుల తోడ నవ్వుల మోముతోడ
సోలి సంకుఁజక్రముల సొంపుతోడ
నేలమిన్నునొకటై నిలుచున్న రూపుతోడ
పాలుపడి మెరసీని ప్రత్యక్ష దైవము //ఎల్ల//
సంపదలు కడుమించి చవులతో నారగించి
జొంపపు విరుల పూజ సొంపుమించి
యింపుల శ్రీవేంకటాద్రి నిరవై వున్నాఁడు వీఁడె
పంపుడు దేవతలతోఁ బ్రతిలేని దైవము //ఎల్ల//