మా విల్సన్ బాబు అన్న గారికి" కన్నీటితో కడసారి వీడ్కోలు" |
SIYONA MINISTRIES WARANGAL
0:00 / 0:00
మా విల్సన్ బాబు అన్న గారికి" కన్నీటితో కడసారి వీడ్కోలు" |
4 977 просмотров · 1 месяц назад
SIYONA MINISTRIES WARANGAL
1,03 тыс. подписчиков
4 977 просмотров · 1 месяц назад
Lyrics, : K. YAKENDER ( 9110527168 )
🎹Music: K. M. TYSON
📼Master&mixing: K.YUWAN TEJ
Editing : K. DEEVEN TEJ
HORMONEY : SIYONA, MANASWINI
పల్లవి :కన్నీటితో నిండెనులే
మా గుండె గుడి అంతా
గుండె పగిలెనులే - మా విల్సన్ బాబు లేక
మాటలు రావట్లేదయ్యా - గొంతు మూగబోయెనయ్యా
ఒక్కసారి రావయ్యా - ప్రేమతో పలకరించవయ్యా
అనుపల్లవి :కన్నీటితో నిండెనులే... మా గుండె గుడి అంతా...
విల్సన్ బాబు... మిమ్మల్ని మరువలేమయ్యా... మరువలేమయ్యా...
చరణం :ఎవరిని చూసినా చిరునవ్వుతో - ప్రేమగా పలకరించేవాడు
మంచి మాటలతో, దేవుని వాక్యంతో - అందరినీ ఆదరించేవాడు
ఆ పలకరింపు ఇక వినలేమా
ఆ నవ్వు ఇక చూడలేమా
ఆ ఖాళీ ఎవరు పూడ్చగలరు -యేసయ్యా నీవే దిక్కయ్యా
చరణం :భార్యను ఉన్నతంగా నిలిపి, ప్రేమకు అర్థం చూపాడు
ముగ్గురు బిడ్డలను డాక్టర్లుగా చేసి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనము
తన స్వార్థం ఎన్నడూ చూడలేదు -కుటుంబమే తన లోకమయ్యా
అట్టి తండ్రిని కోల్పోయిన బిడ్డలను ఆదరించుము యేసయ్యా
అనుపల్లవి :కన్నీటితో నిండెనులే... మా గుండె గుడి అంతా...
విల్సన్ బాబు... మిమ్మల్ని మరువలేమయ్యా... మరువలేమయ్యా...
చరణం :ఈ లోకంలో ఇది తుది వీడ్కోలు కాదు - పరలోకంలో మరల కలయిక ఉంది
యేసు చెంతన నిదురించువారు ధన్యులని వాక్యం చెబుతోంది
ఏడ్వకండి... ఏడ్వకండి... - ఆయన యేసు ఒడిలో ఉన్నాడు
మనమంతా వచ్చేవరకు - యేసు సన్నిధిలో వేచి ఉన్నాడు
కన్నీటితో నిండెనులే... మా గుండె గుడి అంతా...
విల్సన్ బాబు... మిమ్మల్ని మరువలేమయ్యా... మరువలేమయ్యా...