Easy and healthy instant oats dosa #instantrecipe#dosa#telugurecipes
Kopuri vlogs
0:00 / 0:00
Easy and healthy instant oats dosa #instantrecipe#dosa#telugurecipes
231 просмотр · 2 нед. назад
Kopuri vlogs
80 подписчиков
231 просмотр · 2 нед. назад
హాయ్ అండి! ఇవాళ మీకు నేను ఇన్‌స్టంట్‌గా, హెల్తీగా ఓట్స్ దోస చేయబోతున్నాను. ఇది మనకు ఒక 15 నుంచి 20 నిమిషాల్లో అయిపోతుంది.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఓట్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక టీ కప్ సైజు అంత బొంబాయి రవ్వను కూడా యాడ్ చేయాలి.
ఇప్పుడు ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి, దీనికి తగినంత వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా అన్నీ ఒకసారి కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. అంటే, కొద్దిసేపు నానబెట్టాలి.
ఇప్పుడు 15 నిమిషాల తర్వాత నానబెట్టిన ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో కొద్దికొద్దిగా వేసుకుంటూ పిండిలాగా పేస్ట్ చేసుకోవాలి. మనకు వాటర్ అవసరం ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్, ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడు బాగా వేడిగా ఉన్న పాన్ మీద దోసను వేసుకుంటూ ఉండాలి. దీని మీద ఆయిల్ కొద్దికొద్దిగా వేసుకుంటూ, నెమ్మదిగా దోసను తిప్పుకోవాలి.
ఇలా రెండు సైడ్స్ దోసను మంచిగా కాల్చుకోవాలి.
అంతేనండి! ఎంతో సింపుల్‌గా, ఈజీగా మన ఓట్స్ దోస రెడీ అయిపోయింది.
దీనిని మనం పుట్నాల చట్నీతో కానీ, పల్లీల చట్నీతో కానీ, పికిల్స్‌తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి.
#InstantOatsDosa #OatsDosa #OatsDosaRecipe #HealthyBreakfast #EasyBreakfast #BreakfastRecipe #OatsRecipe #DosaRecipe #TeluguRecipes #HealthyRecipes #EasyRecipes #KopuriVlogs