Irandam Thiruvandadi89,90🙏ఇరణ్డామ్ తిరువందాది 89,90 పాశురములు
Padmaja Ramanujadasi
0:00 / 0:00
Irandam Thiruvandadi89,90🙏ఇరణ్డామ్ తిరువందాది 89,90 పాశురములు
1 919 просмотров · Трансляция закончилась 12 дн. назад
Padmaja Ramanujadasi
58,3 тыс. подписчиков
1 919 просмотров · Трансляция закончилась 12 дн. назад
నేటి ప్రశ్నలు: ఇరణ్డామ్ తిరువందాది 89,90 పాశురములు
01 : ఏ ఒక్క పని చేస్తే భూమినే ఏలవచ్చు?
సమాధానము : శ్రీమన్నారాయణుని ఆశ్రయించి, చేతులు జోడించి, నమస్కరిస్తే భూమినే ఏల వచ్చును.
02 : "అతవి" అంటే ఏమిటి?
సమాధానము : "అతవి" అంటే "అణచివేయడం" అని అర్థం. కువలయాన్ని తిరిగి లేవలేనంతగా నిరోధించిన విషయాన్ని తెలియజేస్తూ పూదత్తాழ்వార్లు ఈ పద ప్రయోగం చేసారు.
03 : 89లో భగవానుడు ఆశ్రితుల కొరకు చేసిన 3 పనులు _____ , _____ , ______.
సమాధానము : 89లో భగవానుడు ఆశ్రితుల కొరకు చేసిన 3 పనులు -
కంస సంహారం ( ఆశ్రిత రక్షణం / శిష్టరక్షణ ),
కువలయాపీడ మర్దనం ( ఆశ్రిత శత్రు కర్శనం / దుష్ట శిక్షణ ),
త్రివిక్రముడై ముల్లోకము లాక్రమించడం ( ధర్మ సంస్థాపనం ).
04 : 90వ పాశురంలో ఉటంకించిన పరత్వ చిహ్నాలు ఏవి?
సమాధానము : 90వ పాశురంలో ఉటంకించిన పరత్వ చిహ్నాలు -
శ్రియఃపతిత్వం ( తిరుమాలై );
శెంకణ్ ( పుణ్డరీకాక్షత్వం ) ;
నెడియాన్ ( సర్వేశ్వరత్వం ).
#irandam_thiruvandadi
#pasuram89
#pasuram90
#pudattazhwar
#bhuta_yogi
#srirangam
#thirumala
#6years_of_ynv_goshti
#yathirajanadhavalli_goshti
#padmajaramanujadasi
#acharya_vaibhavam
#ramanuja_vaibhavam
#bhagavad_ramanuja
#thirunakshatram
#divyadesalu
#samasrayanalu
#vaishnava_sampradayam
#srivaishnavism
#bhagavadvishayam
#alwar
#azhwar
#andal
#goda
#krishna
🙏శ్రీమతే రామానుజాయ నమః🙏
🪷 పూదత్తాழ்వార్ విరచిత 🪷
॥ ఇయఱ్పా - ఇరణ్డాన్ తిరువన్దాది ॥
89) కదవి క్కదమ్ శిఱన్ద । కఞ్జనై మున్ కాయ్ న్దు ।
అదవి ప్పోర్ ౹ యానై ఒశిత్తు । ప్పదవియాయ్
పాణియాల్ నీరేற்று । ప్పణ్డొరుకాల్మావలియై ।
మాణియాయ్ ౹ క్కొణ్డిలై యేమణ్॥ 2270
ప్రతిపదార్థములు : కదం సిఱంద కంజనై = కోపము గల కంసుని ; మున్ కదవి కాయ్ న్దు = అతని ముందు నీవును కోపించి సంహరించితివి ; పోర్ యానై అదవి ఒశిత్తు = పోరు చేయుటకు వచ్చిన కువలయా పీడ మను ఏనుగు దంతముల విఱిచి దాని మదము నడచితివి ; పండు ఒరుకాల్ = పూర్వమొక కాలమున ; పదవియాయ్ = తగిన విధముగ ; మాణియాయ్ = బ్రహ్మచారిగ ; మావలియై పాణియాల్ నీర్ ఏற்று = మహాబలి తన చేతులార దాన జలమును నీయగ, మణ్ కొండిలైయై = భూమిని పొందితివి కదా !
భావమ్ : స్వామీ ! కోపోద్రిక్తుడైన కంసుని నీ కోపానలముతో నాశ మొనరించితివి. పోరునకు వచ్చిన కువలయాపీడమను ఏనుగు దంతముల విఱిచి మదము నణచితివి. నీకుచితమైన వటువు రూపమును ధరించి బలిచక్రవర్తి నుండి దాన జలమును పొంది భూభాగముల నాక్రమించితివి.
90) మణ్ణులగమాళేనే ౹ వానవర్ క్కుమ్ వానవనాయ్ ।
విణ్ణులగన్తన్న గత్తు । మేవేనే । నణ్ణి
తిరుమాలై ౹ చ్చెఙ్గణెడియానై । ఎఙ్గళ్
పెరుమానై । క్కైతొழுదపిన్ ॥ 2271
ప్రతిపదార్థములు : తిరుమాలై = శ్రియఃపతిని ; శెంకణ్ = కెంపు కన్నులవానిని ; నెడియానై = సర్వేశ్వరుని ; ఎంగళ్ పెరుమానై = మాస్వామిని ; నణ్ణి = సమీపించి ; కైతొళుదపిన్ = చేతులు జోడించి అంజలి ఘటించిన పిదప ; మణ్ ఉలగం ఆళేన్ = ఈ లీలా విభూతితో కూడిన భూమిని పాలింపనా ? ; వానవర్కుం వానవనాయ్ = నిత్య సూరులతో చేరి ; విణ్ ఉలగం తన్ అగత్తు = నిత్య విభూతి వ్యాపించిన అన్ని స్థలముల ; మేవేన్ = మహదానందమును పొందలేనా ? నాకేది లభించదు ?
భావమ్ : శ్రీలక్ష్మీదేవి నాయకుడు, కెంపు కన్నుల శోభితుడు, సర్వేశ్వరుడైన నా స్వామిని ఆశ్రయించి చేతులు జోడించి నమస్కరించిన పిదప నీ భూ ప్రపంచ మంతయు నా ఆజ్ఞకు లోబడియుండదా ? నిత్య సూరులుకు నధిపతినై మహదానందమును ననుభవింపకుందునా ?!
🪷🙏🪷జై శ్రీమన్నారాయణ🪷🙏🪷
━❀꧁꧂❀┅ ధరణి ┅❀꧁꧂❀━
ONLINE CLASSES
Daily from 3.30pm to 5pm
FCC (Free Conference Call) LINK:
https://join.freeconferencecall.com/p...
TELEGRAM LINK:
https://t.me/joinchat/LyoBXhelW-PjquD...
YOUTUBE LINK:
/ @padmajaramanujadasi
WEBSITE ADDRESS:
https://padmajaramanujadasi.com/te/
WHATSAPP CHANNEL LINK:
https://whatsapp.com/channel/0029Va6S...
INSTAGRAM LINK
https://www.instagram.com/padmaja_ram...
FACEBOOK LINK
/ 1evsdq7rau
అడియేన్ రామానుజదాసి🙏