శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 4500 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ | Mangalagiri
SPANDANA NEWS
0:00 / 0:00
శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 4500 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ | Mangalagiri
185 просмотров · 1 дн. назад
SPANDANA NEWS
4,93 тыс. подписчиков
185 просмотров · 1 дн. назад
#mangalagiri
#srikasiannapurneshwari
#trust
#amavasya
#sivalayam
#srilakshminarasimhaswamy
#fooddistribution
ప్రతి నెలా అమావాస్య సందర్భంగా ఆధ్యాత్మిక సేవతో పాటు భక్తులకు అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మంగళగిరి శ్రీ పానకాల నరసింహస్వామి వారి మెట్ల మార్గం వద్ద అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వేల ఐదు వందల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం వారు భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నదానం సమాజ సేవలో విశిష్టమైనదని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ప్రతి అమావాస్య రోజున వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్న ట్రస్ట్ సేవలను అభినందించారు. దాతలు, భక్తుల సహకారంతో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడం స్ఫూర్తిదాయకమన్నారు. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ ఐదేళ్లుగా ప్రతి అమావాస్య రోజున అన్నసమారాధనను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు..మంత్రి నారా లోకేష్ సేవాస్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ అనేక కార్యక్రమాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు. యువతకు విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు, ఐటీ, విద్యా రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ ఆధునిక మౌలిక వసతులతో ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.. సంక్షేమం, ఉపాధి, మౌలిక వసతులు, రాజధాని అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.. భక్తులు, దాతల సహకారంతో భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం చిల్లపల్లి శ్రీనివాసరావును శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు...
ఈ కార్యక్రమంలో శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సభ్యులు నంగళం ప్రసాద్ ,కర్నాటి శివ సత్యనారాయణ , కటారి విష్ణుమూర్తి , దుంపల స్వాములు , ఖగ్గా శ్రీను , శ్రీహరి , పంచల శివన్నారాయణ , అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి , శ్రీనాథ్ , కొండా శివమ్మ , వేల్పూరు శంకర్ , దండూరి ప్రసాద్ దుంపల నరసింహారావు ,రెడ్డి వీర రాఘవులు , ఊటుకూరు సత్యనారాయణ మూర్తి , నల్లమోలు నాగరాజు , చిరుమామిళ్ల రంగారావు , బేతపూడి మధుబాబు , గండికోట రాజారావు , గండికోట అచ్చయ్య , నంద్యాల గోపాలకృష్ణ , మారం మల్లికార్జున రావు , నూతలపాటి వెంకటేశ్వరరావు , సారికొండ సుబ్బరాజు , ఆదిలక్ష్మి , కోదాటి శ్రీనివాసరావు , పేను బోయిన వెంకటేశ్వరరావు , జంజనం నాగేశ్వరరావు (స్వీట్ షాప్), బీ శివప్రసాద్ , వెంకటేశ్వరరావు (టిఫిన్ బండి), కొలిశెట్టి రాము , జంజనం శేషగిరిరావు , మల్లిబోయిన శ్రీనివాస్ , దొనకొండ రాఘవేంద్రరావు (హైదరాబాద్), గజ్జల రమణారావు , గరికిపాటి బుజ్జిబాబు , ముద్రబోయిన శ్రీనివాసరావు , కుర్రి రామిరెడ్డి , గండికోట భరత్ , జ్ఞానేశ్వరరావు (పెరుగు పాయింట్), కర్ణాటి శ్రీనివాసరావు , కలవకొల్లు కోటేశ్వరావు , పి వీరాంజనేయులు , భీమవరపు ఏడుకొండలు , వై.వి నాగేంద్రం , గోపయ్య , జవ్వాది సురేష్ , కటారి నాగయ్య , బల్లా పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.