@ItikelaBalaiah దధీచి మహర్షి జయంతి ఇంద్రునికి వజ్రాయుధం ఎలా వచ్చిందో తెలుసా?బ్రహ్మశ్రీ చాగంటి గారి
Itikela Balaiah
0:00 / 0:00
@ItikelaBalaiah దధీచి మహర్షి జయంతి ఇంద్రునికి వజ్రాయుధం ఎలా వచ్చిందో తెలుసా?బ్రహ్మశ్రీ చాగంటి గారి
254 просмотра · 1 мес. назад
Itikela Balaiah
1,14 тыс. подписчиков
254 просмотра · 1 мес. назад
𝕝𝕝ॐ𝕝𝕝 19/09/2026 - భాద్రపద శుక్ల అష్టమీ - దధీచి మహర్షి జయంతి ఇంద్రునికి వజ్రాయుధం ఎలా వచ్చిందో తెలుసా
దధీచి మహర్షి జయంతి భాద్రపద శుక్ల అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. వీరి చరిత్ర అత్యున్నతమైన త్యాగానికి ప్రతీక. లోక కల్యాణం కోసం, ఆయన తన శరీరాన్ని త్యాగం చేసి తన వెన్నుముకను (అస్థికలను) ఆయుధాలుగా మలచుకోమని దేవతలకు దానమిచ్చారు.
దధీచి సుకన్య, చ్యవన మహర్షుల పుత్రుడు. సుకన్య శర్యాతి మహారాజు పుత్రిక. ఒకనాడు ఆమె తండ్రితో వినోదార్ధం అడవులకు వెళ్ళింది. అక్కడ చ్యవన మహర్షి తపోనిష్టలో వున్నాడు. శరీరమంతా పుట్టలతో కప్పిపోయి కళ్ళు మాత్రం మహాతేజస్సుతో వెలుగుతున్నాయి.
సుకన్య ఆ కళ్ళను, మిణుగురులని భావించి పుల్లతో పొడవగా చ్యవనుని కళ్ళు పోయాయి. జరిగిన అపచారం తెలుసుకుని శర్యాతి చ్యవనుని క్షమాభిక్ష కోరాడు. చ్యవనమహర్షి సుకన్యని తనకు యిచ్చి వివాహం చేస్తే దోషం పరిహరమౌతుందని చెప్పాడు. శర్యాతి బాధపడినా, విజ్ఞురాలైన సుకన్య వివాహానికి అంగీకరించింది. పరమ సౌందర్యరాశియైన సుకన్య అంధుడైన చ్యవన మహర్షికి సహధర్మచారిణిగా భక్తిశ్రద్ధలతో జన్మను సార్ధకం చేసుకున్నది,
ఆ దంపతులకు దధీచి జన్మించి, వేదవేదాంగాలు చదువుకుంటూ పెరిగి పెద్దవాడు అయ్యాడు. అతని విద్యా పరిపూర్ణత గ్రహించి, ఇంద్రుడు దధీచి కోరకుండానే అతనికి అనేక మహా అస్త్రాలను, బ్రహ్మవిద్యను నేర్పాడు. అయితే వీటిని దధీచి మరెవ్వరికీ నేర్పరాదని నిబంధన విధించాడు. అలా నేర్పితే దధీచి శిరస్సును ఖండిస్తానని స్పష్టం చేశాడు.
అశ్వినీ దేవతలు దధీచిని ఇంద్రుడు నేర్పిన విద్యలను తమకు నేర్పవలసిందిగా కోరారు. దధీచి యెంతో వినయంగా, ' అశ్వనీ దేవతలారా ! నాకు మీయందు యెంతో గౌరవం వున్నది. నాకు తెలిసిన విద్యలు, మీకు నేర్పాలనే వున్నది. అయితే, ఇంద్రుడు నాకు పెట్టిన నిబంధన ప్రకారం నేను మీకు విద్యలు నేర్పినట్లు ఆయనకు తెలిస్తే, నా తల ఖండించే అవకాశం వున్నది. కానీ, యెవరైనా తనకు తెలిసిన విద్యలు వేరొకరికి నేర్పకున్న, అట్టి జ్ఞానం నిరుపయోగము. అట్టి జ్ఞానీ నరకకూపంలో పడతాడు. అందువలన ఆ విద్యలు మీకు నేను నేర్పుతాను, నా తల పోయినా సరే ! ' అంటూ, దధీచి అశ్వనీదేవతల అభ్యర్ధన మన్నించాడు.
ధన్వంతరీ ఉపాసకులైన అశ్వనీ దేవతలు యెంతో తెలివైనవారు. ఉపాయవంతులు. వారు దధీచిని రక్షింపదలచి, ఇంద్రుని కన్నా ముందే అతని తలను ఖండించి, ఒక గుర్రం తలను దధీచికి అమర్చి, గుర్రం తలతో వున్న దధీచి వద్ద, మహాశాస్త్రాల నధ్యయనం చేశారు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు వచ్చి దధీచి అశ్వ శిరస్సును ఖండించాడు. వెంటనే అశ్వనీదేవతలు, తాము భద్రపరిచిన దధీచి అసలైన శిరస్సును, తిరిగి దధీచికి అమర్చి, పునరుజ్జీవితుడిని చేసారు.
మరి కొంతకాలానికి, దేవ దానవ సంగ్రామంలో, రాక్షసబలం అధికంగా వున్నప్పుడు, దానవులు వారి క్షుద్రవిద్యల ద్వారా, దేవతలవద్ద వున్న, ఆయుధాలను ఒక్కొక్కటిగా కాజేయ సాగారు. ఇదితెలిసి దేవతలు మిగిలిన ఆయుధాలు కూడా పోకుండా, కాపాడుకోవాలని తలచి, దధీచిమహర్షి చెంతచేరి, తమ ఆయుధాల్ని కాపాడమని ప్రార్ధించారు.
ఆ విధంగా దేవతల కోరిక మన్నిస్తే, తనకు ప్రాణహాని వున్నదని తెలిసికూడా, తన భార్య ‘గభస్తిని‘ అభ్యంతరం చెప్పినా, దధీచి మహర్షి, దేవతల అవస్థలను గ్రహించి, అంగీకరించాడు. మహర్షి అనుకున్నట్లుగానే, రాక్షసులు అనేకసార్లు, ఆ ఆయుధాలను అపహరించడానికి ప్రయత్నించినా, వారి క్షుద్ర విద్యలు ఆయనముందు పారలేదు.
ఆవిధంగా యెంతో కాలం గడిచిపోయింది. దేవతలు యెంతకీ రాకపోయిరి, వారి ఆయుధాలు తీసుకోవడానికి. అందువలన దధీచిమహర్షి, ఆ ఆయుధాలను కనిబెటి వుండడానికే, తన అమూల్య సమయం వెచ్చించవలసి వస్తున్నది. తపోబలం అంతా, ఈ అస్త్రశస్త్రాలను పరిరక్షించడానికే సరిపోతున్నది.
ఏమి చేయడానికీ పాలుపోక, మరికొంత కాలం నిరీక్షించి, దేవతలజాడ కనబడక పోవడం వలన, ఆ ఆయుధాలన్నీ, చూర్ణం చేసి, తన దగ్గరవున్న, పవిత్రజలంలో వాటిని కలిపి, మంత్రోచ్ఛారణతో వాటిని తనదేహంలో పదిలపరచాడు. ఆతరువాత, నిరాఘాటంగా తన తపస్సు కొనసాగించాడు.
మరి కొంతకాలానికి, దేవతలు వచ్చి వారి ఆయుధాలను అడిగారు. ఆయన జరిగినది చెప్పి, తిరిగి యివ్వలేని పరిస్థితిలో వున్నానని దేవతలకు చెప్పాడు. అయినా దేవతలు, వెళ్లిపోకుండా, ఆయన చుట్టూ తిరుగుతూ, ఆయుధాలను యిప్పించమని కాళ్లావేళ్లా పడసాగారు. ఈ వింతపరిస్థితి వూహించని దధీచిమహర్షి, ' మీ ఆయుధాలు కావాలంటే, నన్ను సంహరించి మీ ఆయుధాలు తీసుకోండి, ' అని వారికి మార్గం చెప్పాడు.
దేవతలు దధీచి చెప్పినమార్గానికి నివ్వెరపోయి, ' ఋషి హత్య మేము చేయలేము, తమరే యేదో విధంగా మాకు మా ఆయుధాలు ప్రాప్టించండి. ' అని అడిగారు. ఇక యేమీ చేయడానికి కుదరక, వారు చూస్తూ వుండగానే, చితి పేర్చుకుని, అందులోపడి మరణిస్తూ, ‘ మీ ఆయుధాలు నా మాంసంలో, ఎముకలతో కలిసిపోయి వున్నవి. వాటిని బ్రహ్మదేవుని ప్రార్ధించి, మీ ఆయుధాలుగా తయారు చేసుకోండి. మీకు శుభమగుగాక ! మీ వలన ధర్మం రక్షింపబడుగాక ! ' అని చెప్పి ఆ మంటలలో ఆహుతి అయ్యాడు, దధీచి మహర్షి.
దేవతలు జరిగినదానిని, నివ్వెరబోయి చూస్తూ బ్రహ్మదేవుని ప్రార్ధించగా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, దధీచి మహర్షి ఎముకలను అస్త్ర శస్త్రాలుగా మలచి దేవతలకు యిచ్చాడు. మహర్షి వెన్నుముకను వజ్రాయుధంగా మలచి, బ్రహ్మదేవుడు ఇంద్రునికి ఇచ్చాడు.
తరువాత దేవదానవ యుద్ధంలో ఆ వజ్రాయుధం యెంతో బలిష్టమైన, పటిష్టమైన ఆయుధంగా యెందరో దానవ వీరులను సంహరించింది. వృత్రాసురుని సంహరించడంలో ఇంద్రుడు యీ వజ్రాయుధాన్ని వుపయోగించాడు. పర్వత శ్రేణులు, ఒకప్పుడు రెక్కలతో భూమిపై తిరుగుతూ జననష్టం కలిగిస్తూ, ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే, ఇంద్రుడు వజ్రాయుధంతోనే, వాటి రెక్కలు కత్తిరించాడు. మైనాకుడు సముద్రంలో దూరి, తప్పించుకున్నాడు.
ఆ విధంగా మహర్షి దధీచిశరీరంలోనుండి బయటకు వచ్చిన ఆయుధాలు, మునుపటి కంటే, శక్తివంతంగా, పదునుగా తయారై, దేవతల ధర్మ సంస్థాపనకు యెంతో ఉ
దధీచి మహర్షి శరీర భాగాలూ, అజరామరాలై, ఆచంద్ర తారార్కం కీర్తి గావించి, అయన నిస్వార్ధ త్యాగబుద్ధికి ప్రతీకలుగా