Shree Krishnudu (నా గురువు) | Lyrical Video - 191 | Sai Sri Charan | Sri Krishna Ashtami Spl Song
Gnanavaahini channel
0:00 / 0:00
Shree Krishnudu (నా గురువు) | Lyrical Video - 191 | Sai Sri Charan | Sri Krishna Ashtami Spl Song
10 024 просмотра · 7 дн. назад
Gnanavaahini channel
25,5 тыс. подписчиков
10 024 просмотра · 7 дн. назад
https://www.thraithashakam.org/public... - శ్రీ కృష్ణుడు దేవుడా! భగవంతుడా!!
https://www.thraithashakam.org/public... - త్రైత సిద్ధాంత భగవద్గీత
"ఎక్కడ శ్రీ కృష్ణుడు ఉంటాడో, అక్కడ త్రైతమే ప్రబోధించబడుతుంది!
ఎక్కడ త్రైతము ఉపదేశించబడుతుందో, అక్కడే శ్రీ కృష్ణుడు ఉంటాడు!!"
సాకీ:
-----
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర త్రైతోపదేశితః |
తత్ర శ్రీ జ్ఞానో భూతిః యోగో భాతిర్మతిర్మమ ||
మంగళం శ్రీ క్షరక్షేత్ర గుణక్షోణి విహారిణే,
దేహసారథి రూపాయ గీతాచార్యాయ మంగళమ్ !
శ్రీ భగవద్ గీతాచార్యాయ మంగళమ్ !!!
పల్లవి:
------
శ్రీ కృష్ణుడు నా గురువు .... తన కృష్ణ తత్త్వమే నా గురువు
కాల రూపమై ... సకల జీవాంత్ర.. కర్మపాలనే ...నా గురువు
గోవిందుడు నా గురువు ... గీతా ప్రబోధమే నా గురువు
విశ్వ రూపమై ... సర్వ జీవాన్త్య.. ధర్మ బోధనే ... నా గురువు
గుణాతీతుడే గురువు ... త్రిగుణాంత వర్ణుడే నా గురువు
రూపరహితుడే గురువు ... సాకార రూపుడే నా గురువు
క్షరుని పోలు అక్షరుడు తానుగా ప్రత్యక్షమౌను గురువు ...
పురుషోత్తముడై సాక్షాత్కరించులే ఆ గురువు
భగవంతుడు నా గురువు ... శ్రీ భగవత్ గీతయే నా గురువు
బ్రహ్మ రూపమై ... సర్వ భవబంధ ... సద్విమోచనే ... నా గురువు
చరణం 1:
--------
జననమనేదే బహు జటిలం.. జీవము లేనిది గర్భస్థలం
ఆ భగమునందునా జ్ఞప్తిగల్గి జీవించు జీవమే గురునిబలం...
ఉత్పత్తి స్థానమును వెలితిలేక ఉద్భోదించునదే గురునికలం
మరణమన్నదే మహ మర్మం ... మరి మనన రహితమేరా మరణం
ఆ తరుణములోనూ మననమొంది శ్వాసించు ప్రణవమే గురునికరం
మృత్యు మర్మమును మాపులేక మార్మ్రోగించునదే గురునిస్వరం
కాలమె ఒక జాలం ... అది ఎరుగుటే గురుమూలం
కర్మమె ఒక మర్మం ... అది తెలుపుటే గురుధర్మం
గోప్యమైన గుణమాయ గుప్తమే గూర్చేదే గురువు... ఆ గూఢ తత్త్వమే నా గురువు
శ్రీ కృష్ణుడు నా గురువు .... తన కృష్ణ తత్త్వమే నా గురువు
జనన మరణ సిద్ధాంత స్థాపుడౌ సత్ సుబోధుడే నా గురువు
ఆధ్యాయుడు నా గురువు ... మధ్యాత్మ మర్మమే నా గురువు
బ్రహ్మకాల కర్మాదిగుణముగల దైవచిహ్నమే నా గురువు
చరణం 2:
--------
అమరమైనదే పరధామం ... అది రూపనామా క్రియా రహితం
ఆ పరమమైన పరమాత్మ పాత్ర పోషించు అంశయే గురురూపం..
తన యోగదృష్టితో సృష్టికర్తనే ప్రతిష్టించుటే గురుకార్యం
అనుభవించుటే ఇహలోకం ... అది బంధమోహ భావా సహితం
ఆభాసయైన జీవాత్మ భ్రాంతి తొలగించు యోచనే గురుభావం
తన జ్ఞానదృష్టితో త్రిగుణభావమే అణచివేయుటే గురుజీవం
ఆత్మయే గురువాద్యం ... మధ్యాత్మయే తన బోధ్యం
త్రైతమె గురువేద్యం ... ఆధ్యాత్మమే తన హృద్యం
అంత్యమందు సిద్ధించు ఆత్మనే చేర్చేదే గురువు ... ఆ పంత వాక్యమే నా గురువు
శ్రీ కృష్ణుడు నా గురువు .... తన కృష్ణ తత్త్వమే నా గురువు
జీవదైవ సందైక్య సారధౌ ఆత్మ సత్తువే నా గురువు
ఆనందుడు నా గురువు ... ఆధ్యాత్మ సూత్రమే నా గురువు
ఆత్మ త్రైతమే అరయజేయు అద్వైత నేత్రుడే నా గురువు
చరణం 3:
--------
విద్య వేద్యమే గురునిధనం ... ఆ విద్య అర్థమే శిష్యతనం
ధర బ్రహ్మవిద్యకై శిష్య మనము పూరించు బంధమే గురుసూత్రం
ధనధృవము తానుగా శిష్య ఋణము దహియించు అనలమే గురుమంత్రం
శిష్యరహితమే గురునికులం ... మరి గురునిపూర్ణమే శిష్యరికం
శూణ్యమైన శిశు తత్త్వమందు మొలకెత్తు విత్తుయే గురుబీజం
పూర్ణమైన గురు సత్త్వమందు శివమెత్తు చిత్తమే గురుతేజం
భక్తుని సందేహం ... భగవానుని సందేశం
శిష్యుని ఉపవాసం ... గురుదేవుని ఉపదేశం
ఏక భక్తి గల శిష్య భగములో ప్రభవించును గురువు ... ఆ ప్రబోధుడేరా నా గురువు
శ్రీ కృష్ణుడు నా గురువు .... తన కృష్ణ తత్త్వమే నా గురువు
భక్తి యుక్తులను బోధజేసి నిజరక్తి నిచ్చులే ...నా గురువు
ఆచార్యుడు నా గురువు ... త్రైతాధికర్తయే నా గురువు
తత్త్వ శక్తినే అందజేయు నిర్ముక్తి దాతయే ... నా గురువు
ముగింపు :
----------
కృష్ణుడే బ్రహ్మ ... శ్రీ కృష్ణుడే విష్ణువు .. శ్రీ కృష్ణ దేవుడేరా మహేశ్వరుడు
శ్రీ కృష్ణుడే సాక్షాత్ పరబ్రహ్మా .... తస్మై శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ... శ్రీ గురుబ్రహ్మణే నమః
Chorus:
శ్రీ కృష్ణుడు నా గురువు .... తన కృష్ణ తత్త్వమే నా గురువు
గోవిందుడు నా గురువు ... గీతా ప్రబోధమే నా గురువు
భగవంతుడు నా గురువు ... శ్రీ భగవత్ గీతయే నా గురువు
ఆధ్యాయుడు నా గురువు ... మధ్యాత్మ మర్మమే నా గురువు
అద్వైతుడు నా గురువు ... ద్వైతాత్మ సూత్రమే నా గురువు
వేదాంతుడు నా గురువు ... త్రైతాధికర్తయే నా గురువు
ఆచార్యుడు నా గురువు ... శ్రీ ప్రబోధేశుడే నా గురువు
ఆనందుడు నా గురువు ... ఆ యోగీశ్వరుడే నా గురువు