Перейти к содержимому

పర్యటాకదినోత్సవంపురస్కరించుకొనిర్యాలీప్రారంబించిన కలెక్టర్ ప్రతిమాసింగ్

Medak news channel

0:00 / 0:00

పర్యటాకదినోత్సవంపురస్కరించుకొనిర్యాలీప్రారంబించిన కలెక్టర్ ప్రతిమాసింగ్

602 просмотра · 1 мес. назад
Medak news channel
354 подписчика
602 просмотра · 1 мес. назад
పరిడ విల్లిన మెదక్ సంస్కృతి వైభోగం 16 కళారూపాల తో ప్రపంచ పర్యాటక దినోత్సవ ర్యాలీ ప్రపంచానికి అన్నం పెట్టింది మెతుకు సీమ మెదక్ పర్యాటక కేంద్రాలను ప్రపంచానికి పరిచయం చేయాలి --మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలో ఆదివారం 4000 మంది తో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మెదక్ ఖిల్లా పై కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతి రాజులు జెండా ఊపి ప్రారంభించారు ప్రారంభించారు. మెదక్ ఖిల్లా సందర్శనార్థం టికెట్ కౌంటర్ ను ప్రారంభించారు. మెదక్ ఖిల్లా నుంచి వెస్లీ కళాశాల వరకు భారీ ఎత్తున ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో డప్పు, డోలు, తంబుర, చిందు, భాగవత, బోనాలు,బతుకమ్మ, గిరిజన లంబాడి, గీతా కార్మికులు ,కరాటే , ఎన్సిసి విద్యార్థులు ,ఒగ్గు తదితర తదితర కళాకారులు వారి వేషధారణలో పాల్గొన్నారు. అనంతరం వెస్లీ కళాశాలలో పర్యాటక రంగ ఏవీ నీ వీక్షించారు . శాంతి సందేశానికి సూచికగా ఎంపీ,కలెక్టర్,అదనపు ఎస్పీ , మున్సిపల్ ఛైర్పర్సన్ తెల్లటి పావురాలను ఎగురవేసి, మెదక్ పర్యాటక రంగా అధికారిక వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రపంచానికి అన్నం పెట్టిన చరిత్ర మెతుకు సీమ మెదక్ అన్నారు. రాష్ట్రస్థాయిలో పర్యాటక రంగంలో మొదటి బహుమతి పొందిన కలెక్టర్ ప్రతిమా సింగ్ ను అభినందించారు. మోదీ నాయకత్వంలో భారతదేశంలో పర్యాటక రంగం చాలా అభివృద్ధి సాధించిందని ప్రపంచంలో ఉన్న 175 దేశాలు భారతదేశానికి పర్యాటక సంస్థలను సందర్శిస్తున్నారని అన్నారు. భారత్ టూరిజం లో చాలా ముందుకెళ్తుందని తెలిపారు. శని, ఆదివారాల్లో పర్యాటక ప్రేమికుల దృశ్య ట్రాఫిక్ నియంత్రించాలని సూచించారు. మెదక్ జిల్లా ప్రకృతి కాపాడాలన్నారు. ప్రకృతి , టూరిస్ట్ ప్రదేశాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని సూచించారు. ప్లాస్టిక్ బదులుగా స్టీల్ వస్తువులను ఉపయోగించాలన్నారు. జిల్లా యంత్రాంగం పర్యాటక అభివృద్ధి కోసం జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో మెదక్ జిల్లా వెనకబడిందన్నారు.కలెక్టర్ ప్రతిమా సింగ్ వచ్చిన తర్వాత మెదక్ అభివృద్ధికి కొత్త ఊపొచ్చిందని ప్రశంసించారు.ఆదిలాబాద్, ములుగు జిల్లాలకు పోటీగా మెదక్ టూరిజం అభివృద్ధి చెందుతోందని తెలిపారు.పోచారం అభయారణ్యం, నర్సాపూర్ అర్బన్ పార్క్, ఏడుపాయల వనదుర్గ, మెదక్ చర్చి తదితర ప్రాంతాల మరింత అభివృద్ధి చేయాలన్నారు. మెదక్ జిల్లాను ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ కృషి చేస్తుందన్నారు. నర్సాపూర్ అడవుల అందాలను సినీ పరిశ్రమ కూడా గుర్తించిందన్నారు. పర్యాటక అభివృద్ధితో హోటళ్లు, టూరిస్ట్ గైడ్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రపంచ చిత్రపటం లో టూరిజం ర్యాంకింగ్ విషయంలో భారతదేశం 69వ స్థానంలో ఉండేదని, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక టూరిజం విషయంలో. 69 నుంచి 39 వ స్థానానికి ఎదిగిందన్నారు. ప్రపంచ పర్యాటక పటంలో భారత్ స్థానం మెరుగుపడుతోందనీ వివరించారు. మెదక్ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని యువతకు పిలునిచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్థానిక భాష నేర్చుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మన ప్రాంతంలో పుట్టిన మనమే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. కలెక్టర్ కలలు కంటున్న టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మన ఊరు.. మన ప్రాంతం.. మనమే రక్షించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో చాలా చారిత్రక వారసత్వ , సాంస్కృతిక సంపద, కలిగి ఉందని , దానిని భావితరాల కు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. పర్యాటక సర్క్యూట్ గా చేసేందుకు 14 ప్రదేశాలను గుర్తించామన్నారు. మెదక్ జిల్లా పర్యాటక ప్రదేశాలను ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలో టూరిజం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకే ఉద్యోగ ఉపాధి మార్గాలు లభిస్తాయని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పి విక్రమ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ .. జిల్లా చారిత్రక ప్రదేశాలను, వారసత్వ సంపదను భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలన్నారు. మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో అనేక వారసత్వ సంపదను కలిగి ఉండడం జిల్లా ప్రజల అదృష్టం అన్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చి మెదక్ ను సందర్శించేలా ప్రజల సహకరించాలన్నారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంపై చదివిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మేమంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, జెడ్పి సీఈవో, జిల్లా టూరిజం అధికారి ఎల్లయ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి , డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు, స్పోర్ట్స్ ఆఫీసర్ రమేష్, మెదక్ మున్సిపల్ కమిషనర్ నవీన్, మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కళాకారుడు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.