30 August 2026
Manapuram Srinivas
0:00 / 0:00
30 August 2026
97 просмотров · 13 дней назад
Manapuram Srinivas
106 подписчиков
97 просмотров · 13 дней назад
రామ చిలకా రావమ్మా
నా ప్రేమలేఖను రాయమ్మా
తీపి పలుకుల చిలకమ్మా
నా ప్రేమ భాషను చెప్పమ్మా
ఆకు చాటు జామని అందుకోమని
దోర దోర పండుని దోచుకోమని
పచ్చి పచ్చి ప్రేమలో తీపినే చూడమని
ఆకు వక్క లేని తాంబూలమే నేననీ
తీపి పలుకుల చిలకమ్మా
నా ప్రేమ భాషను చెప్పమ్మా
నా మనసును నమ్మమని
నీ మనసును పంచమని
కళ్ళు కళ్ళు కలిసిన వేళ
చెలిమికి చిగురులు వేయమని
రామ చిలకా రావమ్మా
నా ప్రేమలేఖను రాయమ్మా
కన్నె కాయనే సన్నగా కోయమనీ
వన్నె వలపునే వాడిగా పట్టమనీ
చెమ్మ చెక్క పాటలే పాడమని
హద్దు పొద్దు లెరుగనీ ఆటనే ఆడమని
రామ చిలకా రావమ్మా
నా ప్రేమలేఖను రాయమ్మా
వావి వరస కలిసెను రాశి వాసి కుదిరెను
వీరు వారు వచ్చిచేరి చేయి చేయి కలిపెను
బుగ్గ చుక్క పెట్టెను పట్టు చీర చుట్టెను
పెళ్లి బొట్టు దిద్దెను పెళ్లి బాజా మోగెను
రామ చిలకా రావమ్మా
నా ప్రేమలేఖను రాయమ్మా
తీపి పలుకుల చిలకమ్మా
నా ప్రేమ భాషను చెప్పమ్మా
సాహిత్యం : మానాపురం శ్రీనివాస్