Перейти к содержимому

గయా క్షేత్రం

SRI DATTA GANESHA శ్రీ దత్త గణేశ

0:00 / 0:00

గయా క్షేత్రం

335 215 просмотров · 4 года назад
SRI DATTA GANESHA శ్రీ దత్త గణేశ
2,33 тыс. подписчиков
335 215 просмотров · 4 года назад
పుణ్య క్షేత్రాలు అన్నిభగవంతుని మహిమలను ఉనికిని చాటి చెబుతుంటాయి. పాపవిమోచనం కలిగించి దివ్య అనుభూతులను ప్రసాదిస్తాయి. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత. క్షేత్ర దర్శనం వల్ల మనిషి ఒక్కో మెట్టు పైకి చేరుకున్నట్టు గా ,,,ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. గయ క్షేత్రం మరింత ప్రత్యేకమైనది. గతించిన పెద్దలకు కృతజ్ఞతా పూర్వకంగా చేసే పితృ కర్మలు... పితృదేవతలను సంతృప్తిపరచి, వారిని పుణ్యలోకాలకు వెళ్ళే విధంగా తోడ్పడతాయని హిందూ సంప్రదాయం చెబుతోంది. పితృదేవతల ఆశీస్సులతో వల్ల కుటుంబ వృద్ధి కలుగుతుందని మన విశ్వాసం . ఈ వీడియోలో గయా క్షేత్రంలో కొలువై ఉన్న మంగళ్య గౌరీ దేవి గురించి, ఆ క్షేత్రంలో విష్ణు పాదం ఏర్పడిన కారణాలు, గయాసురుడి వృత్తాంతం, సీతారామలక్ష్మణులు గయా క్షేత్రాన్ని దర్శించిన విశేషాలు చర్చించబడ్డాయి. ఈ విశ్వమంతా పంచభూతాల చేత నిర్మించబడింది. భగవంతుడు పంచ భూతాత్మక స్వరూపుడు. మనిషి శరీరం కూడా పంచభూతాలతో నిర్మించబడింది. భూమి నుంచి జన్మించిన గింజ నీటి లోతడిసి అగ్ని వాయువుల సహాయంతో అన్నంగా మారుతుంది. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం గా భావిస్తాము..అన్నాన్ని భూమి ఆకారంలో ముద్దగా చేసి దానిలోకి పితృ దేవతలను ఆవాహన చేసి శ్రాద్ధకర్మలను నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది . ఇది ఎలా వచ్చింది అన్న విషయం కూడా ఈ వీడియోలో చర్చించబడింది. మహనీయులైన ఋషీశ్వరుల తపశ్శక్తి వల్ల, భగవంతుని కరుణ వల్ల ఏర్పడిన క్షేత్రాలను దర్శించడం, ఆ మహిమలను తలచుకోవటం అందరి కర్తవ్యం. అదే ఉద్దేశంతోఈ వీడియో రూపొందించబడింది. ఈ వీడియోలో ఉపయోగించిన అన్ని దృశ్యాలు , ఉపయోగించిన నేపద్య శబ్దాలు, సంగీతం అన్ని ఇంటర్నెట్ సహాయంతో "క్రియేటివ్ కామన్స్ ' అని ప్రకటించిన వాటి నుంచి సేకరింపబడినాయి. అన్ని హక్కులు వాటిని నిర్మించిన వారివే. ఓం శ్రీ దత్త నాధాయ నమః శ్రీ గణేశాయ నమః