నిశ్శబ్ద నాయకుడు:THE UNSUNG HERO OF INDIAN CONSTITUTION #constitution #india #ambedkar #history
anchorpunnamaraju
0:00 / 0:00
నిశ్శబ్ద నాయకుడు:THE UNSUNG HERO OF INDIAN CONSTITUTION #constitution #india #ambedkar #history
26 044 просмотра · 4 недели назад
anchorpunnamaraju
13,1 тыс. подписчиков
26 044 просмотра · 4 недели назад
రాజ్యాంగ నిర్మాణనేపథ్యంలో నిశ్శబ్ద నాయకుడు ఎవరు? అతడే సర్ బి.ఎన్. రావు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ పని ప్రారంభించక ముందే భారత రాజ్యాంగానికి తొలి ROUGH ముసాయిదా (First Rough Draft) రాసిన వ్యక్తి.
In this video we cover:
Who is B N Rau and why he is called Nishabda Nayakudu?
What was the role of B N Rau in Constitution making?
What did Dr Ambedkar say about B N Rau on 25th Nov 1949?
#IndianConstitution #BNRau #ConstitutionOfIndia #UnsungHero #Ambedkar #NishabdaNayakudu #TeluguHistory #Rajyangam #UPSC #APPSC
భారత రాజ్యాంగ చరిత్రలో ఒక అత్యున్నత ఘట్టానికి శ్రీకారం చుట్టిన రోజు 29 ఆగస్టు 1947..భారత రత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి సమర్ధ నేతృత్వంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడిన రోజు.భారత రాజ్యాంగ నిర్మాణంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన ఆ చారిత్రక దినానికి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి, చరిత్రని నిశితంగా పరిశీలిస్తే... రాజ్యాంగ నిర్మాణానికి పడిన పునాదులు కనిపిస్తాయి. చరిత్ర పుటల్లో నిక్షిప్తమైన ఎన్నో అక్షర సత్యాలు వెలుగులోకి వస్తాయి.అలాంటి చారిత్రక వాస్తవాల్లో ఒకటి...రాజ్యాంగ నిర్మాణ నేపథ్యనికి తన మేధో సర్వస్వాన్ని ధారపోసిన ఒక మహనీయుడి అవిరళ కృషి.ఆయన అసాధారణ కృషికి సంబంధించిన అనేక ఆధారాలు నేటికీ చరిత్ర పుటలలో భద్రంగా ఉన్నాయి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ పని ప్రారంభించక ముందు, రాజ్యాంగ నిర్మాణ నేపథ్యంలో Constitutional Adviser గా అత్యంత కీలకమైన పాత్ర పోషించిన ఆ మేధావి...సర్ బెనగల్ నర్సింగ్ రావు.రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డా. బి. ఆర్. అంబేద్కర్ స్వయంగా బి. ఎన్. రావు కృషిని ఏమని ప్రశంసించారు ? 1946 డిసెంబర్ 17 న రాజ్యాంగ సలహాదారుగా నియమించబడిన నాటి నుంచి నుంచి అనేక కమిటీలు...అనేక చర్చలు...వందలాది ప్రతిపాదనలు...వేలాది సవరణలు...ఎన్నో భిన్నాభిప్రాయాలు...వీటన్నింటి మధ్య రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియను ముందుకు నడిపించడంలో సర్ బి. ఎన్. రావు చేసిన మహత్తరమైన కృషి ఏమిటి? ఆయన సిద్ధం చేసిన ముసాయిదాలోని అంశాలు తరువాతి రాజ్యాంగ అధికరణాల్లో ఏ విధంగా ప్రతిఫలించాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను అన్వేషిస్తూ...చరిత్రలో అంతగా వెలుగులోకి రాని ఆ మహనీయుడి పాత్రను మీకు పరిచయం చేసే చిన్న ప్రయత్నమే...“నిశ్శబ్ద నాయకుడు”.. రాజ్యాంగ నిర్మాణ చారిత్రక నేపథ్య వాస్తవాలను తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉంటే...ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియొ లింకును అందరితో పంచుకోండి. మరొక చిన్న విన్నపం.. రాజ్యాంగం మీద మనకు ఉన్న గౌరవాన్ని కాపాడుతూ, అవాంఛిత వ్యాఖ్యలకు , వ్యక్తిగత దూషణలకు, రాజకీయ విమర్శలకు తావులేకుండా...మీ అభిప్రాయాలను నిర్మాణాత్మకంగా YouTube లో కామెంట్ల రూపంలో తెలియజేయండి. చరిత్రను తెలుసుకోవడం మన హక్కు...చరిత్రను గౌరవించడం మన బాధ్యత. వందేమాతరంభారత రాజ్యాంగ నిర్మాణ నేపథ్యంలో బి. ఎన్. రావు చేసిన కృషికి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు:
1. Constituent Assembly Debates (CAD) – Parliament Digital Library:
https://eparlib.sansad.in/
భారత రాజ్యాంగ సభలో జరిగిన అధికారిక చర్చల రికార్డులు భారత పార్లమెంట్ Digital Library (eParlib)లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 25 నవంబర్ 1949న డా. బి. ఆర్. అంబేడ్కర్ చేసిన ప్రసంగంలో బి. ఎన్. రావు రాజ్యాంగ ముసాయిదా తయారీలో చేసిన కృషికి స్పష్టమైన ప్రస్తావన ఉంది.
2. B. N. Rau – Draft Constitution, October 1947:
https://www.constitutionofindia.net/c...
Constitution of India Historical Archives లో బి. ఎన్. రావు Constitutional Adviser గా తయారు చేసిన Draft Constitution, October 1947 కు సంబంధించిన అసలు చారిత్రక పత్రం అందుబాటులో ఉంది. వివిధ కమిటీల నివేదికలు, నిర్ణయాలను సమగ్ర రాజ్యాంగ ముసాయిదాగా సమీకరించడంలో ఈ Draft కు కీలక ప్రాధాన్యం ఉంది.
3. B. Shiva Rao – The Framing of India's Constitution: Select Documents, Vol II:
బి. శివరావు సంపాదకత్వంలోని ఈ ప్రామాణిక గ్రంథంలో బి. ఎన్. రావు రూపొందించిన Fundamental Rightsకు సంబంధించిన Preliminary Notes, 17 మార్చి 1947న ఆయన జారీ చేసిన Constitutional Questionnaire, Union Constitutionకు సంబంధించిన Notes మరియు Memoranda వంటి ముఖ్యమైన రాజ్యాంగ నిర్మాణ పత్రాలు సంకలనం చేయబడ్డాయి.
https://books.google.com/books/about/...
4. B. Shiva Rao – The Framing of India's Constitution: Select Documents, Vol III:
ఈ సంపుటిలో October 1947లో Constitutional Adviser బి. ఎన్. రావు తయారు చేసిన Draft Constitution, ఆయన విదేశీ రాజ్యాంగ అధ్యయన పర్యటనకు సంబంధించిన Report, అలాగే 21 ఫిబ్రవరి 1948న Drafting Committee సమర్పించిన Draft Constitution వంటి కీలక పత్రాలు ఉన్నాయి.
https://books.google.com/books?id=UrA...
2