జిందగీ
musicmania
0:00 / 0:00
జిందగీ
3 просмотра · 1 дн. назад
musicmania
222 подписчика
3 просмотра · 1 дн. назад
Here, it's my poem published in ANEKA page of TELUGU PRABHA on 12-10-2026
*********************
It's the Time to Unlearn, the జిందగీ !
--- డాక్టర్ మామిడి హరికృష్ణ 8008005231
1.అకాల కాలాల నుంచి వాళ్లంతా ఒకటే మాట చెబుతున్నారు
"నేర్చుకో... నేర్చుకో" అని
Rama Pithecus కాలం నుంచి Rousseu వరకు
"రోజూ ఒకటైనా తెలుసుకో...
ప్రతి రోజూ ఏదో ఒకటి నేర్చుకో" అనే చెప్పారు
బతుకు కోసం.. బతకడం కోసం నుంచి సృజనాత్మకంగా జీవించడం వరకూ
అవసరమైతే అభిమన్యుడు ప్రహ్లాదుడి లాగా
పుట్టకముందు నుంచే నేర్చుకోవాలని అన్నారు
Emily లాగానో, Mougli లాగానో
ప్రకృతిని చూసో, ప్రజల్ని కలిసో
రోజూ నేర్చుకో అనే చెప్పారు
అందుకే నేర్చుకోవడం లోనే క్షణాలన్నీ ఆవిరైపోయాయి
ఆస్వాదించడం, అనుభూతి చెందడం అనుభవించడం అనేవి
మనోదేహాలలో తప్పిపోయాయి!
2.అప్పుడు కొత్త పాట మొదలెట్టారు!
నేర్చుకోవడం కన్నా నేర్చుకునే ప్రక్రియను అనుభవించమని
Learning లోని process ను
Destination కన్నా journey ని enjoy చేయమని
కొత్త పల్లవిని వినిపించారు
అందులోనూ నేర్చుకోవాల్సింది ఉందని
దాన్ని నేర్చుకొమ్మన్నారు
అవును కదా అనుకుని
గమ్యం కన్నా గమనాన్ని ఆస్వాదించాను
లక్ష్యం కన్నా ప్రయాణాన్ని ప్రేమించాను
ప్రయాణంలోని మజిలీలను అనుభవించాను
మజిలీ మజిలీ కి
విరామ విరహ విరాగ విహారాలను అనుభూతించాను
3.ఇప్పుడు latest గా prompting నేర్చుకోమంటున్నారు
యుగాల నుంచీ నన్ను prompting చేసి చేసి నన్ను నడిపించారు కదా
నన్ను controlling చేసీ చేసీ
మీరనుకున్నవన్నీ నాకు నేర్పించారు కదా...
నా అనుభూతిని కుదించి భాషను
నా జ్ఞానాన్ని ఒత్తేసి పుస్తకాలను
నా ఊహలకు ఫ్రెములు బిగించి కళలను
నా ఆలోచనలను పరిమితం చేసి సరిహద్దులను
నా విశాలత్వాన్ని సంకోచింపచేసి దేశాలను
నా విశ్వరూపాన్ని అదిమేసి ఇల్లును
నా ఆదిమ సహజాత సహజత్వాన్ని నియంత్రించి
నాగరికతను సృష్టించారు కదా...
మొత్తంగా
విస్తారమైన నా ప్రపంచాన్ని ఆరడుగుల జాగాకి కుదించారు కదా
ముడుచుకోవడం, ముకుళితం కావడం
క్రుంగిపోవడం, కురచనై పోవడమే
జీవన సత్యమని prompt చేశారు కదా!
4.ఇక చాలు, ఇప్పుడు అన్నింటినీ unlearn చేయాలి
నేర్చుకోవడం వల్ల వచ్చిన content ను character ను
అభ్యసనం వల్ల ఒనగూడిన behaviour ను barriers ను
Conditioning వల్ల నేర్చుకున్న knowledge ను pledge ను
సేకరించడం వల్ల సమకూరిన information ను, intelligence ను క్లీన్ చేయాలి
ఇప్పుడు reboot, refresh, relocate, relearn కాదు
ఏకంగా మొత్తం జిందగీ నే unlearn చేయాలి!
5.కొత్త zenome map ను సృష్టించాలి
కొత్త అక్షరాన్ని ప్రసవించాలి
కొత్త conditioning పద్ధతులను తయారు చేయాలి
సరి కొత్త prompting code ను రాయాలి....
6. అవునూ, మళ్ళీ నేను కూడా
నా పూర్వీకులు చెప్పిన మాటల్నే repeat చేస్తున్నానా?