దేవా నా జీవితమిదిగో నీ సొంతం || Deva Na Jeevithamidigo || Telugu Christian Songs
Telugu Gospel Songs
0:00 / 0:00
దేవా నా జీవితమిదిగో నీ సొంతం || Deva Na Jeevithamidigo || Telugu Christian Songs
61 209 просмотров · 6 лет назад
Telugu Gospel Songs
115 тыс. подписчиков
61 209 просмотров · 6 лет назад
#DevaNaJeevithamidigo
#DevaNajeevitham
#DevaNaJeevithamIdigo
#దేవానాజీవితమిదిగోనీసొంతం
#TeluguChristianSongs
#JesusSongsTelugu
దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2)
నా వరకైతే బ్రతుకుట నీ కోసం
చావైతే ఎంత గొప్ప లాభం (2)
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా||
నా కరములు నా పదములు నీ పనిలో
అరిగి నలిగి పోవాలి ఇలలో
సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో
అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము||
నా కాలము అనుకూలము నీ చిత్తముకై
ధనము ఘనము సమస్తము నీ పనికి
నా మరణము నీ చరణముల చెంతకై
నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2) ||నా శరీరము||