గణపతి ఎక్కడ? మాజీ మావోయిస్టుల కొత్త రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర చర్చ
G1TGNews
0:00 / 0:00
గణపతి ఎక్కడ? మాజీ మావోయిస్టుల కొత్త రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర చర్చ
11 963 просмотра · 2 нед. назад
G1TGNews
753 подписчика
11 963 просмотра · 2 нед. назад
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మావోయిస్టుల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ వేదికపై చర్చ జరుగుతోంది. ‘జన తెలంగాణ పార్టీ’ పేరుతో రాజకీయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి ఒక కీలక ప్రశ్నపై పడింది.
ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడ ఉన్నారు?
దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గణపతి 2018లో పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రస్తుత ఆచూకీ మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు.
మరోవైపు మాజీ మావోయిస్టు నాయకుల రాజకీయ భవిష్యత్తు, వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు, కొత్త రాజకీయ వేదిక లక్ష్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఉచిత విద్య, ప్రజారోగ్యం, ఉపాధి భద్రత, కాంట్రాక్ట్–అవుట్‌సోర్సింగ్ వ్యవస్థలపై విధానం, భూ సంస్కరణలు, రైతు సంక్షేమం వంటి అంశాలను ముందుకు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బులెట్ నుంచి బ్యాలెట్ వైపు సాగుతున్న ఈ కొత్త రాజకీయ ప్రయాణం ఎటువైపు?
గణపతి ఈ రాజకీయ పరిణామాల్లో ఏదైనా పాత్ర పోషిస్తారా? లేదా ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంటారా?
ఈ అంశాలపై G1 TG News ప్రత్యేక విశ్లేషణ.
మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి.
వార్త నచ్చితే LIKE 👍 SHARE ↗️ SUBSCRIBE 🔔 చేయండి.
G1 TG News – తెలుగు వాణి!
#G1TGNews #Ganapathi #MuppalaLakshmanaRao #JanaTelanganaParty #TelanganaPolitics #Maoists #FormerMaoists #TelanganaNews #TeluguNews