గంగవ్వ ఇంట్లో గుప్త నిధులు.. | Karnataka - TV9
TV9 Telugu Live
0:00 / 0:00
గంగవ్వ ఇంట్లో గుప్త నిధులు.. | Karnataka - TV9
1 720 369 просмотров · 8 месяцев назад
TV9 Telugu Live
14,5 млн подписчиков
1 720 369 просмотров · 8 месяцев назад
కర్నాటకలోని గదగ్ జిల్లా లక్కుండి గ్రామంలో ఇంటి కోసం పునాది తీస్తుండగా గుప్తనిధి బయటపడడం తీవ్ర సంచలనం రేపింది. గంగవ్వ బసవరాజ్ రిత్తి ఇంటి స్థలంలో నిధి దొరికింది. ఓ కుండలో శతాబ్దాల కాలం నాటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంకె బిందెల్లో గిన్నెలతో పాటు బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అవి దాదాపు ఒక కిలో బరువు ఉన్నట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు జిల్లా కలెక్టర్ దుర్గేష్, ఎస్పీ రోహన్ జగదీశ్, ఏసీ గంగప్ప, తహసీల్దార్ శ్రీనివాస్ కులకర్ణి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పురావస్తు అధికారులు కూడా అక్కడికి వచ్చి నిధిని పరిశీలించారు. లభ్యమైన బంగారు ఆభరణాలు ఏ కాలానికి చెందినవో అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. లక్కుండిలో లభ్యమైన నిధిని స్థానిక వినాయకుడి గుడిలో భద్రపర్చారు. ఆలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గంగవ్వ ఇంట్లో లభించిన గుప్తనిధిని చూడడానికి వందలసంఖ్యలో జనం అక్కడికి తరలివచ్చారు. లంకెబిందె లభించిన చోటును అధికారులు మార్కింగ్ చేశారు. గుప్త నిధి లభ్యమైన దృష్ట్యా, ఆ ప్రాంతంలో మరిన్ని నిధులు ఉండే అవకాశం ఉన్నందున...అధికారులు అక్కడ మరింత లోతుగా తవ్వకాలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా ఇలా దొరికిన నిధులు ప్రభుత్వానికే చెందుతాయి. కానీ చట్టాల ప్రకారం వాటిని ఎవరు సొంతం చేసుకోవాలి, ఎలా పంచుకోవాలనే దానిపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిబంధనలు ఉంటాయి.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#Karnataka #GuptaNidhulu #tv9telugu