Перейти к содержимому

"వాడిని మా చేతుల్లో పెట్టండి.. ప్రాణానికి ప్రాణం తీస్తాం!" | Kowkoor Child Murder Case | ABP Desam

ABP Desam

0:00 / 0:00

"వాడిని మా చేతుల్లో పెట్టండి.. ప్రాణానికి ప్రాణం తీస్తాం!" | Kowkoor Child Murder Case | ABP Desam

1 898 просмотров · 1 дн. назад
ABP Desam
787 тыс. подписчиков
1 898 просмотров · 1 дн. назад
"వాడిని మా చేతుల్లో పెట్టండి.. ప్రాణానికి ప్రాణం తీస్తాం!" | కౌకూర్ ఆర్కిడ్ విల్లాస్ వద్ద నివాసితుల కన్నీటి ఆందోళన | Kowkoor Child Murder Case #ABPTeluguNews #ABPDesam #TeluguNews , #Kowkoor #OrchidVillas #Jawaharnagar #ChildMurderCase #SecurityGuardVikram #JusticeForOreli #HyderabadCrime #MalkajgiriPolice #CrimeNewsTelugu #BreakingNewsTelugu హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ (మల్కాజిగిరి కమిషనరేట్) పరిధిలోని కౌకూర్ ఆర్కిడ్ విల్లాస్‌లో ఐదేళ్ల చిన్నారి ఒరేలిని మాజీ సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ పాశవికంగా హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిందితుడు విక్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, స్థానికుల్లో ఆగ్రహజ్వాలలు ఏమాత్రం చల్లారడం లేదు. తాము నెలకు వేలాది రూపాయలు వెచ్చించి నమ్ముకున్న సెక్యూరిటీ గార్డే పగతో పసిపాప ప్రాణాలు తీస్తాడని ఊహించలేకపోయామని విల్లాస్ నివాసితులు, మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. "ఇలాంటి క్రూర మృగానికి విచారణలు అక్కర్లేదు.. వాడిని మాకే అప్పగించండి, ప్రాణానికి ప్రాణం తీసి చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుస్తాం" అంటూ విల్లాస్ గేటు వద్ద భారీ ఎత్తున బైఠాయించి నిరసన చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీలలో సైతం పసిపిల్లలకు రక్షణ లేకపోతే ఎక్కడ ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జవహర్‌నగర్ పోలీసులు అదనపు బలగాలను మోహరించి, విల్లాస్ వద్ద పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడిపై కఠిన చట్టాల కింద విచారణ జరిపి శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam