RAHUL SIPLIGUNJ - GANESHUNI PAATARO || 2026 || MUSIC VIDEO - #ganeshsong #rahulsipligunj #artist
Sipligunj’s music
0:00 / 0:00
RAHUL SIPLIGUNJ - GANESHUNI PAATARO || 2026 || MUSIC VIDEO - #ganeshsong #rahulsipligunj #artist
89 017 просмотров · 8 часов назад
Sipligunj’s music
1,1 млн подписчиков
89 017 просмотров · 8 часов назад
ఏందయ్యా గణపయ్యా నీ కోసం ఎన్ని పాటల్ జేసినా
నువ్వు మాత్రం దర్శనం ఇస్తలేవ్
హహహహ.... వస్తా పోరా బిడ్డా నీ కోసం
గణేశుని పాటరో ఉత్త మాట కాదురో
కథ చెప్తా ఇనుర్రో ఖతర్నాక్ అనుర్రో
దడ దడ దడ దడ దడ దడ తొండం జూడు ఓ బేటే
ధన ధన ధన ధన ధన ధన దండం బెట్టు
ఈ పూటే
గణ గణ గణ గణపతిని తల్సుకుంటె ఓ ఛోటే
ఇంటా అరె బైటా అచ్చే దిన్ షురువంటా
బేటా బీటేస్కో...
చరణం :
గౌరమ్మ బిడ్డవయ్యా నువ్
పిండి బొమ్మవయ్యా
తానాలు జెయ్యబోతే కాపలా ఉంటివయ్యా
నీ తండ్రి లింగమయ్య నువ్ అడ్డమొస్తివయ్యా
కోపంతో ఊగెనయ్యా నీ మీదికొచ్చెనయ్యా
శివా శివా శిగమూగెనే శివయ్యా
హరా హరా తన తప్పు తెలిసెనయ్యా
తల తల ఏన్గు తలను తొడిగెనయ్యా
కళ కళ లోకాలు మురిసెనయ్యా
నీ తండ్రి జంగమయ్యా పార్వతీ బిడ్డవయ్యా
గజముఖం తొడిగినాక
కొత్త రూపమొచ్చెనయ్యా
నీ అన్న కుమారయ్యరో నీకు పోటికొచ్చెరో
గిర గిర గిర గిర గిర గిర ముల్లోకాల్ తిరిగెరో
నీ అన్న ఆడ తిరిగెరో నువ్వు ఈడ తిరిగెరో
జీత్ గయా బప్పా అన్న కన్నా గొప్ప
చరణం :
నువ్ గెలిశి వొస్తెనయ్యా
దావతూ జేస్తిరయ్యా
నచ్చింది తింటివయ్యా
నీ పొట్ట పగిలెనయ్యా
నిను జూసి సెంద్రుడయ్య
కిల కిల నవ్వెనయ్యా
పార్వతమ్మ గుస్స అయ్యే
చంద్రునికి శినిగెనయ్యా
వల వల చంద్రుడేడ్చెనె వల వల
గిల గిల బతిలాడెనె గిల గిల
సల సల సల్లబడ్డది పార్వతమ్మ
చవితిల నీ మొకం ఎవన్ని
సూడొద్దన్నది అమ్మ
గణేశుని పాటరో గల్లీల హైలెట్టురో
ఉత్త మాట కాదురో తెల్లందాక ఆటరో
గల గల గల గల గల గల లడ్డు హర్రాస్ వెట్టరో
దన దన దన దన దన సౌండ్ బాక్సులు వలగొట్టరో
గల గల గల గల గల గల గంగమ్మ ఒడికి జేర్చరో
ఆతా ఫిర్ ఆతా అగ్లె సాల్ మస్త్ హోతా
అలయ్ బలయ్ లేకే మల్ల మల్ల అదే మోత
మోరియా...
గణపతి మా బప్పా
గణపతి బప్పా మోరియా