Перейти к содержимому

Anantapuram Famous Uggani | Rayalaseema Special Uggani Bajji | Anantapuram Uggani Bajji | Food Book

Food Book

0:00 / 0:00

Anantapuram Famous Uggani | Rayalaseema Special Uggani Bajji | Anantapuram Uggani Bajji | Food Book

64 488 просмотров · 5 лет назад
Food Book
193 тыс. подписчиков
64 488 просмотров · 5 лет назад
ఎన్నో విభిన్నమైన రుచులు రాయలసీమ సొంతం. సీమ లోని ప్రాంతానికో వంటకం మంచి రుచిని కలిగి లభ్యమగు ఆయా ఊర్లకు ప్రసిద్ధి చేకూర్చితే, ఉగ్గాని వంటల పరంగా రాయలసీమ అంతటికీ విశిష్టత ను చేకూర్చింది... కాలానుగుణంగా అల్పాహారాల జాబితాలో క్రమ సంఖ్య పెరుగుతున్న ప్రాచీన నేపథ్యం గల ఉగ్గాని సీమ సోదరుల విశేష ఆదరణతో తన ప్రభావం కొనసాగిస్తోంది.ఇక్కడే కాదు సమీపాన గల కర్ణాటక లోని రాయచూరు, బళ్లారి మరియు తెలంగాణ లోని గద్వాల్ ప్రాంతాలలో ప్రాముఖ్యమైన అల్పాహారం గా వర్ధిల్లుతుంది. ఆయా ప్రాంతాల్లో బోరుగుల తిరగవాతగా,బోరుగుల చిత్రాన్నంగా పిలుస్తున్న ఉగ్గానిగా మనందరికీ సుపరిచితం అన్నది విధితమే. తయారీకీ అయ్యే వ్యయం స్వల్పం.రుచి అద్భుతం కనుక.తమ స్థోమతకు తగ్గ వంటకమనుకునే రెక్కాడితే గానీ డొక్కాడని, కాయకష్టం చేసే వారు. ఉగ్గాని బీద వాని బిర్యానీ గా భావిస్తారు. వేడి, వేడి ఉగ్గానిపై కొబ్బరి కారం మిళితం చేసుకుని భూక్యాలు అనగా బజ్జిలు నంజుకుని తింటే వచ్చు రుచి అద్భుతం .తిన్నవారికీ ఆ రుచికరమైన అనుభూతి తెలిసిందే.అలానే వడ తో సైతం జోడించుకుని తింటే చాలా బాగుంటుంది.ఓ సారి తింటే ఉగ్గానినీ వదలరు. రాయలసీమ ప్రసిద్ధి చెందిన అల్పాహారం ఉగ్గాని గూర్చి కార్యక్రమం చిత్రీకరణకై 39 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన అనంతపురం లోని రామ్మూర్తి గారి అల్పాహార శాలను ఎంచుకున్నాము.సుధీర్ఘ కాలంగా ఆహార శాలలో పనిచేసిన నేపథ్యం రామ్మూర్తి గారిది.ఆ అనుభవం తో చిన్న పాక ఏర్పాటు చేసుకుని 1982లో సొంతంగా అల్పాహారాల శాలను ప్రారంభించి ఉగ్గాని తోపాటు అనేక అల్పాహారాలు అందిస్తూ అనంతపురం లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారినీ చిత్రీకరణ సమయంలో దగ్గరగా పరిశీలన చేసాను. సహృదయులు రామ్మూర్తి గారు.లాభాపేక్ష దృక్పథం కాదు రామ్మూర్తి గారిది .నిర్ధేశిత ధరకు డబ్బులు తగ్గిన, అసలు లేకున్నా ఫరవాలేదు తరువాత ఇవ్వొచ్చు ముందు తినమంటారు. వారి ఆహార శాలలో ఉగ్గాని తిన్న నాకు మా భాగ్య రెడ్డి, శ్రీను, వివేక్ లకు చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా అనంతపురం వెళ్తే రెవెన్యూ కాలనీ లోగల రామ్మూర్తి గారి ఆహార శాల లో ఉగ్గాని రుచి చూడండి. నిత్యం ఇక్కడ తినేవారి అభిప్రాయం తెలుసుకున్నా తదుపరి రామ్మూర్తి గారు మనకు తమ ఆహార శాల గురుంచి విభరిస్తారు. #RayalaseemaSpecialUgganiBajji #Foodbook Anantapur,anantapuram,anantapuramnews,anantapuramfamousfood,anantapurameggdosa,thadipatribiryani,rayalaseemafoods,rayalaseemaeggdosa,oliga,lucky9,kadapakaramdosa,anantapuramstreetfood,anamthapuram oliga,rayalaseema special oliga,anamthapuram famous uggani bajji,traditional food recipes,traditional sweet,uggani recipe,uggani street food,anantapur food,foodbook,anantapur uggani,rayalaseema street food,rayalaseema vantalu,vaggani recipe kannada,raichur vaggani,borugulu