మొక్కుబడితో ఉన్న అమ్మవారి దున్నపోతు
JP News
0:00 / 0:00
మొక్కుబడితో ఉన్న అమ్మవారి దున్నపోతు
12 532 просмотра · 3 недели назад
JP News
56,6 тыс. подписчиков
12 532 просмотра · 3 недели назад
పోలేరమ్మ జాతరలో భక్తిపారవశ్యం: నేత్రపర్వంగా దున్నపోతు పూజ.. వైభవంగా ఘటోత్సవ ఊరేగింపుకు సన్నాహాలు
ఆధ్యాత్మిక వైభవానికి, శతాబ్దాల ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. జాతర క్రతువుల్లో పరమ పవిత్రమైన, ప్రత్యేక విశిష్టత కలిగిన ‘ఘటోత్సవం’ పట్టణంలో ఆధ్యాత్మిక శోభను నింపింది. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్వాహకులు, భక్తులు ఈ వేడుకకు ముందుగా అరుదైన సంప్రదాయం.. దున్నపోతుకు శాస్త్రోక్త పూజలు చేసారు.ఘటోత్సవానికి నాందిగా జాతర ఆచారాల్లో విశేష ప్రాధాన్యత కలిగిన దున్నపోతుకు స్థానిక కాంపాలెం ప్రాంతంలో అత్యంత నిష్ఠతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలు, పూలమాలలతో దున్నపోతును సర్వాంగ సుందరంగా అలంకరించి గ్రామ పెద్దలు, పూజారులు శాస్త్రోక్తంగా అర్చనలు చేశారు. గ్రామానికి ఎలాంటి కీడు జరగకుండా, పోలేరమ్మ తల్లి చల్లని చూపు నిలిచి ఉండాలని ఆకాంక్షిస్తూ చేసిన ఈ పూజా కార్యక్రమం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. పూజలు పరిసమాప్తమైన అనంతరం, ఆ దున్నపోతును ఊరేగింపు కోసం సిద్ధం చేశారు. అనంతరం మధ్యాహ్నం నిర్వహించబోయే,అమ్మవారి ఘటాల ఆగమనంలో .. పురవీధుల్లో జాతర సంప్రదాయాల ప్రకారం.. ఊరేగింపులో అమ్మవారి దివ్య ప్రతిరూపాలైన పవిత్ర ఘట్టం కుండల కంటే ముందుగా పూజలు అందుకున్న దున్నపోతును నడిపిస్తారు. దాని వెనుకే మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాల నడుమ పోలేరమ్మ తల్లి ఘటాల ఊరేగింపు వైభవంగా సాగుతుంది . వేపాకుల తోరణాలు, ధూపదీప నైవేద్యాల సువాసనలతో వెంకటగిరి పురవీధులన్నీ ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లుతాయి . మహిళలు ఇళ్ల ముంగిట రంగవల్లులు తీర్చిదిద్ది, నీళ్లారబోసి అమ్మవారి ఘటాలకు కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు.
ఈ అపురూప సాంప్రదాయ ఘట్టాన్ని, ఊరేగింపు మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు, స్థానికులు వీధుల్లో బారులు తీరి . పోలేరమ్మ నామస్మరణతో వెంకటగిరి పట్టణం మార్మోగిపోతుండగా, జాతర ప్రాంగణమంతా భక్తిపారవశ్యంతో పులకించిపోతుంది.