Перейти к содержимому

మేఘాల కొండ వంజంగి / Vanjangi hill station/ Araku

telugu nature power

0:00 / 0:00

మేఘాల కొండ వంజంగి / Vanjangi hill station/ Araku

1 378 просмотров · 1 год назад
telugu nature power
44,9 тыс. подписчиков
1 378 просмотров · 1 год назад
వంజంగి మేఘాల కొండ (#vanjangi Hills) అనేది విశాఖ మన్యంలో పాడేరు మండలం వంజంగి వద్ద మేఘాల కొండ. ఈ కొండ పైన కనిపించే మేఘాలను చూసి సందర్శకులు మధురానుభూతికి లోనవుతారు. పాడేరు ప్రాంతం కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇది సుందరమైన ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదకరమైన ప్రదేశం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమలలో పాడేరు సమీపంలోని వంజంగి కొండలపై దట్టమైన మేఘాల మధ్య నుండి ఉదయిస్తున్నట్లు అనిపించే సూర్యుడుని చూడడానికి వచ్చే ప్రకృతి ప్రేమికులతో ఇది ప్రసిద్ధి చెందింది. కొత్తగా కనుగొనబడిన హిల్ స్టేషన్లలో ఇది ఒకటి. సముద్ర మట్టానికి 3,400 అడుగుల ఎత్తులో ఉన్న వంజంగి హిల్స్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. దీంతో వంజంగి మేఘాల కొండ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త పర్యాటక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న వంజంగి విశాఖపట్నం నుండి 100 కి.మీ, పాడేరు గ్రామం నుండి 6 కి.మీ దూరంలో ఉంది. ఇక కొండపైకి చేరుకోవాలంటే ఐదు కిలోమీటర్లు నడవాలి. వంజంగి, అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పాడేరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 84 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 181 ఇళ్లతో, 652 జనాభాతో 65 హెక్టార్లలో విస్తరించి ఉంది. #araku #vanjangi #paderu #visakhapatnam #andhrapradesh #movielocation #travel ‪@telugunaturepower‬ #telugunaturepower