Перейти к содержимому

ఉపవాస ఉజ్జీవ ప్రార్ధన పండుగలు // day-2 Message by పాస్టర్ ఎం. సైలస్ గారు // 29 సెప్టెంబర్ 2026

JPH pydibheemavaram

0:00 / 0:00

ఉపవాస ఉజ్జీవ ప్రార్ధన పండుగలు // day-2 Message by పాస్టర్ ఎం. సైలస్ గారు // 29 సెప్టెంబర్ 2026

144 просмотра · Трансляция закончилась 11 дней назад
JPH pydibheemavaram
823 подписчика
144 просмотра · Трансляция закончилась 11 дней назад
తేదీ : 29 సెప్టెంబర్ 2026 మంగళవారం యేసుక్రీస్తు ప్రార్ధనా మందిరం పైడిభీమవరం 21 రోజుల ఉపవాస ఉజ్జీవ ప్రార్ధన పండుగలు రెండవ రోజు వర్తమానికులు : పాస్టర్ పాస్టర్ ఎం.సైలస్ గారు అంశం*: *రోమా సంఘానికి పౌలు చేసిన హెచ్చరిక https://www.youtube.com/live/ktPnohJs... మూలవాక్యం : రోమీయులకు 1:8 మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరి నిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రోమీయులకు 1:9 ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, రోమీయులకు 1:10 మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ★ రోమా పత్రికలో 16 ఆధ్యాయాలు ఉన్నాయి, 433 వచనాలు ఉన్నాయి. ★ ఈ గ్రంధం క్రీస్తు శకం50 వ సంవత్సరం నుండి 58.వ సంవత్సరం మధ్యలో వ్రాసిన గ్రందం ★ రోమా పత్రిక ముఖ్య గ్రంధకర్త అపోస్తలుడైన పౌలు 1. దేవునికి కృతజ్ఞతలు తెలియపరిచే వారిగా ఉండాలి. కీర్తనలు 103:1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తనలు 103:2 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ★ దావీదు దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తి ★ దావీదు కృతజ్ఞత కలిగి దేవునితో సమాధాన పడ్డాడు. ★ దేవుడు చేసిన మేలు మరచిపోకూడదు. యోనా 1:1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. యోనా 1:2 ​నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. యోనా 1:3 అయితే యెహోవా సన్నిధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ★ యోనా దేవుని మాటను మరిచి కృతజ్ఞత లేకుండా ఉన్న కారణాన చాలా నష్టపోవలసి వచ్చింది. 2. దేవుని చిత్తము చేసేవారిగా ఉండాలి. ఆదికాండము 6:22 నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ★ 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ ఓడను నిర్మించాడు. ★ నోవాహు చేవుని చిత్తాన్ని జరిగించాడు. 1యోహాను 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. రోమీయులకు 1:9 ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, రోమీయులకు 1:10 మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. 3. ప్రార్ధన చేసే వారిగా ఉండాలి 2దినవృత్తాంతములు 7:1 సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతరమైన బలులను దహించెను; యెహోవా తేజస్సు మందిరమునిండ నిండెను, ★ సొలోమోను ప్రార్ధన వలన ఆకాశము నుండి వచ్చి మందిరమంతా మహిమతో నిండింది. రోమా సంఘానికి పౌలు చేసిన హెచ్చరికలు👇🏻 1. దేవునికి కృతజ్ఞతలు తెలియపరిచే వారిగా ఉండాలి. 2. దేవుని చిత్తము చేసేవారిగా ఉండాలి. 3. ప్రార్ధన చేసే వారిగా ఉండాలి దేవుడు మనలను దీవించును గాక ఆమేన్ ప్రార్ధనా అవసరతలకు : 9441804941 మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి. యూట్యూబ్ చానల్ 👇🏻    / @jph_pydibheemavaram   వాట్సప్ చానల్ 👇🏻 Follow the JPH PYDIBHEEMAVARAM channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb6E... Instagram channel https://www.instagram.com/jphpydibhee...