Перейти к содержимому

పాటలేమని పాడమే..బతుకమ్మ | Bathukamma Emotional Song 2026 | Madhupriya | Ramesh Hazari |Honey Ganesh

RuNews Telugu

0:00 / 0:00

పాటలేమని పాడమే..బతుకమ్మ | Bathukamma Emotional Song 2026 | Madhupriya | Ramesh Hazari |Honey Ganesh

53 685 просмотров · 16 ч назад
RuNews Telugu
361 подписчик
53 685 просмотров · 16 ч назад
#TSPolitics #BRSNews #KTRLive //పాటలేమని పాడమే.. బతుకమ్మ// Madhupriya Emotional Song - 2026 పల్లవి: పాటలేమని పాడమే బతుకమ్మ ఆటలెట్ల ఆడమే మాయమ్మ నీల్లులేని చెరువుల బతుకమ్మ నిన్నెట్ల విడువాలెనే మాయమ్మా మల్లెప్పుడొస్తవని బతుకమ్మ బదులెట్ల అడుగమమ్మో మాయమ్మా పాటలేమని పాడమే బతుకమ్మ ఆటలెట్ల ఆడమే మాయమ్మ ....... చరణం1: తల్లికోడినిడిసి తల్లడిల్లె పిల్ల తండ్రిని యెడబాసి గుండె బలిగె పల్లె పుట్లకొద్దిగ నిండేటి వడ్ల గరిసెలు కూలెనమ్మా పుట్టెడంత దుక్కము మా పుట్టిల్లు నిండెనమ్మా పాటలేమని పాడమేబతుకమ్మ ఆటలెట్ల ఆడమే మాయమ్మ ...... చరణం 2 : కళతప్పిన పల్లె కన్నీరు పెడుతుండె కల్లోలమై బతుకు అంధకారము నిండె కేసియారు కాల్వల అయ్యో కన్నీరు పారుతుండే నెర్రె బారిన చెరువోలె ఎండి బీడాయే రైతు గుండె పాటలేమని పాడమే బతుకమ్మ ఆటలెట్ల ఆడమే మాయమ్మ ........... చరణం 3: సావుతో కలెబడి సాధించె రాష్ట్రాన్ని ఇంటిపెద్దయి తాను నేర్పించె ఇగురాన్ని మోసపోతెగోసనీ మనకు ఆనాడే చెప్పినాడే కేసేయారు మాటలు వినక పెడశెవిన పెడితిమమో పాటలేమని పాడమే బతుకమ్మ ఆటలెట్ల ఆడమే మాయమ్మ ..,....... చరణం 4: పచ్చని రాష్ట్రాన్ని పగబట్టే కక్షలు పాలనా వొదిలేసి ఆ పిచ్చి చేష్టలు దొంగ చేతికి తాళము మాయమ్మ దోపిడీకి మూలమాయే ఏతుల రోతలాయే వాని బూతుల కూతలాయే పాటలేమని పాడమే బతుకమ్మ ఆటలెట్ల ఆడమే మాయమ్మ .......,. చరణం 5: వొక్కొక్క పువ్వుతో నిను పేర్చుకున్నట్టు తీరొక్క పథకాన తీర్చిదిద్దె బతుకు సబ్బండ వృత్తులన్నీ నాడు సద్దుల బతుకమ్మలే దండుగన్నెవుసాయమే బాపు దసర పండుగ జేసెనే సబ్బండ వర్గాలకు అనాడు సంబురాల పాలన ........ చరణం 6: కాటగలిసిన బిడ్డ తల్లి ఒడిజేరంగ తెలంగాణ తల్లి మోము మల్ల మురువ మా ముఖ్యమంత్రి వయ్యీ బాపు మల్ల నువ్వు రావాలెనే చల్లని సందమామవై ప్రగతి వెన్నెలలు పంచరావే ఆటలే ఆడుకుంటాం నువ్వొస్తే పాటలే పాడుకుంటాం ఆటలే ఆడుకుంటాం ప్రగతి పాటలే పాడుకుంటాం.. Concept & Lyrics: Ramesh Hazari Singer : Madhupriya Music: Honey Ganesh #KCR #KTR #Telangana #BRSParty #BRSPartyNews #HarishRao #BRSNews #TelanganaPolitics #BRS #TRS #KCRNews #TSPolitics #BharatRashtraSamithi #KTRLive #KCRLive