Vinayaka Chavithi Vrata Katha |వినాయక చవితి వ్రత కథ| పూజ పుస్తకం అవసరం లేదు. Video చూస్తూ చదువుకోండి
Shree Sahasra Slokha
0:00 / 0:00
Vinayaka Chavithi Vrata Katha |వినాయక చవితి వ్రత కథ| పూజ పుస్తకం అవసరం లేదు. Video చూస్తూ చదువుకోండి
654 просмотра · 3 дня назад
Shree Sahasra Slokha
242 подписчика
654 просмотра · 3 дня назад
ఈ ఏడాది వినాయక చవితి పర్వదినం సందర్భంగా, మీరు మీ ఇంట్లోనే స్వయంగా పూజ చేసుకోవడానికి వీలుగా ఈ వీడియో రూపొందించబడింది. చాలామందికి పూజ సమయంలో పుస్తకం వెతకడం కష్టమవుతుంది, లేదా గ్రాంథిక సంస్కృతం చదవడం రాదు.
అందుకే, ఈ వీడియోలో పుస్తకంలో ఉన్న విధంగానే సంస్కృత శ్లోకాలు మరియు వ్రత కథను స్పష్టమైన అక్షరాలతో స్క్రీన్ పై ఉంచాను. మీరు ఈ వీడియో ప్లే చేసి, వింటూనే స్క్రీన్ చూసి చదువుకుని నిష్టగా పూజ చేసుకోవచ్చు.
ఈ వీడియోలోని ముఖ్యాంశాలు:
సంప్రదాయబద్ధమైన సంస్కృత వ్రత కథ పఠనం
పూజ చేసుకునేవారి కోసం స్క్రీన్ పై తెలుగు టెక్స్ట్
ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ పూర్తి చేయడానికి సహాయపడుతుంది
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఓం గం గణపతయే నమః!
విఘ్నేశ్వరుని కథా ప్రారంభము
అక్షతలు చేతిలో పట్టుకుని కథ పూర్తయిన పిమ్మట కొన్ని దేవుని మీద, కొన్ని తలమీద చల్లుకోవలయును)
సూతమహాముని శౌనాకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోష కారణంబును తన్నివారణంబును చెప్పుదొడంగెను.
పూర్వము గజరూపముల రాక్షసేశ్వురుడు శివుని గురించి ఘోరతపం బొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి “స్వామీ నీవు ఎల్లప్పుడు నా యుదరమందే వసించీ
యుండు”మని కోరెను. భక్తసులభుడు నా పరమేశ్వరుండాతని కోర్కెదీర్ఫ గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుండె.కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక పలు తెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుండగుటదెలిసి రప్పించుకొను మార్గంబుగానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతము దెలిపి, “ఓ మహానుభావా!పూర్వము భస్మాసురుని బారినుండి నా పతిని రక్షించి నాకొసగితివి. ఇప్పుడు గూడ నుపాయాంతరముచే రక్షింపుమనివిలపింప, హరియా పార్వతిని నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, గజాసురసంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి బ్రహ్మాదిదేవతలచే తలకొక వాయిద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు సన్నాయిదాల్చి గజాసుర పురంబుజొచ్చి, జగన్మోహనంబుగానాడించుచుండ గజాసురుడు విని వారల పిలిపించి తన భవనముయెడుట నాడించ నియమించెను.బ్రహ్మాదిదేవతల వాద్య విశేషముల భోరుగొల్ప జగన్నాటక సూత్రధారియగు నా హరిచిత్ర విచిత్రముగ గంగిరెద్దు నాడించగా గజాసురుడుపరమానంద భరితుడై “మీకేమి కావಲಯనో కోరుడోసంగెద” నన, హరి సమీపించి, “ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనటకుశివుని కనుగొనటకు వచ్చేగాన శివునొసంగు” మని పల్కె ఆ మాటకు గజాసురుండు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరి గా నెరంగి తనకు మరణమే నిశ్చయమునుకొనుచు తన గర్భస్థుoడగు పరమేశ్వరుని “నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి,నా చర్మమును నీవు ధరింపవే”యని ప్రార్థించి, విష్ణుమూర్తికి అంగీకారము దెలుప, హరినందిని ప్రేరేపింప నందియు తన శృంగములచేగజాసురుని చీల్చి సంహరించే, అంత మహేశ్వరుండు గజాసుర గర్భము నుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని స్తుతించే. అంత నాహరిదుష్టాత్ములల కిట్టి వరంబులీయరాదు. యిచ్చినచో పామునకు పాలుపోసినట్లుగ”నని, యుపదేశించి బ్రహ్మాదిదేవతలను వీడ్కోలిపితానును వైకుంఠమున కరిగె, శివుండు నందినెక్కి కైలాసంబున కతివేగముగ జనియె.
వినాయకోత్పత్తి
కైలాసంబున పార్వతి భర్తరాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగస్నాన మాచరించింది. తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితోనొక బాలుని చేసి, ప్రాణంబోసింగి, వాకిలి ద్వారమున కాపుంచె. స్నానానంతరము పార్వతిసర్వాభరణముల నలంకరించుకొనిపత్య్రాగమనమును నిరీక్షించుచుండె అంత పరమేశ్వరుడు వచ్చి నందినధిరోహించి, లోపలికి పోబోవ ద్వారమందున్నబాలకుడడ్డగింప కోపావేశుండై త్రిశూలముచే నా బాలకుని కంఠంబు దునిమి లోనికేగె.
పార్వతీదేవి భర్తనుగాంచి ఎదురేగిఅర్ఘ్యపాద్యదులపూజించే. వారిరువురును ప్రియ భాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చే. అంత మహేశ్వరుండు తానానరించినపనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును నాబాలుని కతికించి ప్రాణంబోసంగి గజాననుండని నామంబోసంగె. అతనిని పుత్ర ప్రేమంబునఉమామహేశ్వరులు పెంచు కొనుచుండిరి. గజాననుండు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగాఎక్కి తిరుగుటకు అనిన్యుడను నొక ఎలుకను వాహనముగా చేసికొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు
కుమారస్వామి జన్మించె. ఇతను మహాబలశాలి. ఇతని వాహనము నెమలి. ఇతడు దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతి గాంచియుండెను.
విఘ్నేశాధిపత్యము
ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట
శమంతకమణోపాఖ్యానము
#VinayakaChaturthi2026 #GaneshChaturthi #VinayakaVrathaKatha #SanskritSlokas #GaneshPuja #Vigneswara #PoojaVidhanam #HinduFestival #Devotional #TeluguChannel #GaneshStotram #శమంతకమణి #వినాయకచవితి #గణపతిపూజ #వ్రతకథ #సంస్కృతం #పూజచేసుకునేవిధానం #VinayakaChavithiSpecial #Ganesha #Spiritual #Hinduism #LivePuja #PujaWithText #Bhakti #HinduTraditions #GaneshFestival
#Shree Sahasra Shloka channel
#Vinayak Ne Puja vidhanam