Перейти к содержимому

ఆ జిల్లాలో చిన్న వర్షానికే మునిగిపోతున్న ప్రభుత్వ కార్యాలయాలు - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

ఆ జిల్లాలో చిన్న వర్షానికే మునిగిపోతున్న ప్రభుత్వ కార్యాలయాలు - TV9

5 099 просмотров · 17 ч назад
TV9 Telugu Digital
3,2 млн подписчиков
5 099 просмотров · 17 ч назад
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వర్షాకాలం వస్తే చాలు ప్రభుత్వ కార్యాలయాలలో తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. ముమ్మిడివరంలోని తహసీల్దార్, సబ్ ట్రెజరీ, పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ వంటి కీలక కార్యాలయాలన్నీ బ్రిటిష్ కాలం నాటి పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, వర్షం కురిసిన ప్రతిసారీ ఈ కార్యాలయాల పరిసరాలు పూర్తిగా జలమయమవుతున్నాయి. ప్రవేశ మార్గాల్లో నీరు నిలవడంతో ఉద్యోగులు విధులకు హాజరుకావడం, పనుల నిమిత్తం వచ్చే ప్రజలు లోపలికి వెళ్లడం నరకప్రాయంగా మారుతోంది. ముఖ్యంగా సబ్ ట్రెజరీలోని ఆర్థిక రికార్డులు, తహసీల్దార్ కార్యాలయంలోని భూ సంబంధిత పత్రాలు, పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ రికార్డుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. నీరు లోపలికి చేరితే కీలక పత్రాలు, విద్యుత్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు నూతన భవనాలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. #Mummidivaram #Konaseema #GovernmentOffices #Waterlogging #OldBuildings #RainProblems #AndhraPradesh #TV9D #TV9Telugu credits : #Rajeshwarinamala Uploadedby : #Tharunkethireddy ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu