Перейти к содержимому

గుడిరేవు, పద్మల్ పురి దర్బార్ లో | ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ | #JAYGONDRAJ

JAY GOND RAJ

0:00 / 0:00

గుడిరేవు, పద్మల్ పురి దర్బార్ లో | ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ | #JAYGONDRAJ

785 просмотров · 14 ч назад
JAY GOND RAJ
14,6 тыс. подписчиков
785 просмотров · 14 ч назад
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పద్మల్‌పురి కాకోబాయి అమ్మవారిని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. పద్మల్‌పురి కాకోబాయి అమ్మవారు ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమని, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఇటువంటి పుణ్యక్షేత్రాలు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దండారి గుస్సాడి కళాకారుల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, మంజూరైన నిధులను ఈ వారంలోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గుడిరేవు ప్రాంతంలో పుష్కర ఘాట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారితో కలిసి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పుష్కర ఘాట్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో పాటు పలువురు ప్రముఖ ఆదివాసీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.