పండగ రోజు వంట త్వరగా అవ్వాలి అంటే ఇలా చేయండి | 9 పండగ వంటలు 2 గంటల్లో..! | ఉగాది స్పెషల్
Sakhi Diaries
0:00 / 0:00
పండగ రోజు వంట త్వరగా అవ్వాలి అంటే ఇలా చేయండి | 9 పండగ వంటలు 2 గంటల్లో..! | ఉగాది స్పెషల్
629 980 просмотров · 5 лет назад
Sakhi Diaries
531 тыс. подписчиков
629 980 просмотров · 5 лет назад
Editor: SARITHA KUMARI
#VillageVantakalu
#TimesavingItems
#KitchenTips
#UgadiDishes
#UgadiVantalu
#Ugadi
#TeluguNewYear
#UgadiPindiVantalu
#mamidikayaPappu
#mamidikayaChutney
#pulihora
#lemonrice
#SpicyAlasandaVada
#PandagaRasam
#PurnamBhakshalu
#VankayaCurry
#BrinjalCurry
#Raita
#PacchiMamidikayaPappu
#DanchinaMamidikayaChutney
#KandibedaluCombinationMamidikayaPappu
#Chitrannam
#NimmakayaPulihora
#TemplePrasadham
#DevudiPulihora
#BobbarlaVadalu
#ShanagaBedalaRasam
#ShanagaBedalaPappu
#KattuRasam
#Oliyalu
#PurnamBhakshalu
#PoluruVankayaCurry
#UrligaddaPacchadi
____________________________________________________
మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దామా
కావలసిన పదార్థాలు:-
కందిపప్పు-2 కప్పులు
ఉల్లిగడ్డ -1
మామిడికాయ -1 (పెద్దది)
పసుపు- 1 టేబుల్ స్పూన్
కారం- 4టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
జీలకర్ర పొడి -1/2 టేబుల్ స్పూన్
మెంతి పొడి - 1 టేబుల్ స్పూన్
ధనియాలు- 1/2 టేబుల్ స్పూన్
కొత్తిమీర- తగినంత
చింతపండు - ఒక నిమ్మకాయ సైజు అంత
ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల కందిపప్పు తీసుకుని బాగా కడగాలి.తరువాతరెండు కప్పుల కందిపప్పు కు ఆరు కప్పుల నీళ్లు ఎసురుగా( కొలత గా)పోసుకుని స్టౌ పైన పెట్టుకోవాలి.ఇది కొద్దిగా ఉడికిన తరువాత పసుపు వేసుకోవాలి.పప్పు పొంగకుండా ఉండడానికి ఇందులోకి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి అండి.
పప్పు కొద్దిగా ఉడికిన తరువాత ఉల్లిపాయలు వేసుకోండి. పప్పు 80% ఉడికింది అనుకున్నప్పుడుపెద్దగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అందులోకి వేసుకోవాలి.
కొద్దిగా తెరలాగా మూత పెట్టుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది.తరువాత ఇందులోకి 4 స్పూన్ల కారం వేసుకోవాలి.హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ,ఒక టీ స్పూన్ మెంతిపొడి,కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.ధనియాలను వీడియోలో చూపించిన విధంగా చేతితో అలా నలిపి వేయాలి.వీటన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలియబెట్టండి.
మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదండి.మామిడి కాయ పులుపు తక్కువగా ఉంటే కొంచెం చింతపండు వేసుకోండి.
ఇలా కొద్ది సేపు ఉడికిన (మగ్గిన)తరువాత స్టవ్ ఆఫ్ చేసి రుచికి తగినంత ఉప్పు వేసి పప్పు గుత్తి తో
ఎనుపుకోవాలి.
తరువాత పొపు(తిరగమాత) పెట్టుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ!
బక్షాలకు పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా
కావలసిన పదార్థాలు:-
శనగపప్పు- ఒక కేజీ
బెల్లం -ఒక కేజీ
యాలకుల పొడి- రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
ముందుగా ఒక పెద్ద సైజు గిన్నె( సర్వ)తీసుకొనిఅందులోకి సగంపైగావచ్చేంతవరకు నీళ్లు పోసుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెను స్టౌ పైన పెట్టి ఒక పది నిమిషాలు నీళ్లు మరిగించాలి.నీళ్లు మరిగే లోపల శెనగపప్పు ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి.నీళ్లు మరిగిన తరువాత ముందుగా శుభ్రం చేసుకున్న శెనగపప్పు ని అందులోకి వేయాలి.శెనగపప్పు ఉడికేటప్పుడు స్టవ్ ని ఫుల్ ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి.ఉడికేటప్పుడు పొంగు బయటికి రాకుండా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి.ఉడికేటప్పుడు మధ్యమధ్యలో తెల్లని పొంగులా వస్తుంది అది మనం గరిటెతో తీసి వేయాలి.మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి.ఒక కేజీ శనగపప్పు ఉడకటానికి 30 నుంచి 40 నిమిషాల టైం పడుతుంది.ఈ లోపల మనము బెల్లంని చిన్న చిన్నఉండలుగా దంచుకోవాలి.చివరగా వీడియోలో చూపిన విధంగా శనగపప్పును చేతితో ఒత్తితే అలా మెత్తగా అవుతుంది అప్పుడు శనిగపప్పు ఉడికిన అని అర్థం.
అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి గిన్నెకు ఒక క్లాత్ కట్టి అన్నం గంజి వంచినట్లు వంచుకోవాలి.లేదంటే వీడియోలో చూపిన విధంగానైనా బొర్రల గిన్నె కింద ఇంకొక గిన్నె పెట్టి వంచుకోవచ్చు.
ఇప్పుడు నీళ్లు అన్ని వంచిన తరువాత మనం తీసుకున్న బెల్లం( శనగ బెల్లం ఎంత తీసుకుంటే అంతే కొలతతో బెల్లం తీసుకోవాలి)ఇందులో వేసి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి.మధ్య మధ్యలో వీడియోలో చూపిన విధంగా కుదించుకోవాలి.ఐదు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాతవీడియోలో చూపిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి.
అంతే పూర్ణం రెడీ!
బక్షాల రసం(స్వీట్ రసం)(శనగ బాళ్ళ కట్టు రసం) ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా
కావలసిన పదార్థాలు:-
శనగ పప్పుఉడికించిన నీరు- 5 గ్లాసులు
పసుపు- ఒక స్పూను
కారం - ఒకటిన్నర స్పూను
ఉప్పు - రుచికి తగినంత
ఉల్లిగడ్డ - 1(పెద్దది)
టమోట పండు -2
బెల్లం - ఒక ఉంట
కొత్తిమీర - కొద్దిగా
పూర్ణం - మనం తినే స్వీట్ తగినంత వేసుకోవాలి
ముందుగా ఒక గిన్నెలో కి శెనగపప్పు ఉడికించిన నీరు 5 గ్లాసులు తీసుకుని అందులో కి ఒక స్పూన్ పసుపు,ఒకటిన్నర స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు, ఉల్లిగడ్డ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి.బెల్లం మెత్తగా చేసుకుని ఇందులోకి వేసుకోవాలి.అన్నింటినీ కలిపి వీడియోలో చూపించిన విధంగా 15 నుంచి 20 నిమిషాల వరకు మరిగించుకోవాలి.రసం కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి.రసం బాగా ఉడుకుతున్నప్పుడు మనం తినే స్వీట్ కి తగినంతగా పూర్ణం వేసుకోవాలి.ఇప్పుడు ఒకసారి అన్నింటినీ బాగా కలియబెట్టాలి.చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. వేరొక కడాయి తీసుకుని రసంకి పోపు( తిరగమాత)పెట్టుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన బక్షాల రసం(స్వీట్ రసం) రెడీ!
భక్షాలు తయారు చేసుకోవడానికి పిండి ని( సైనం) ఎలా కలుపుకోవాలో చూద్దామా
కావలసిన పదార్థాలు:-
పేని రవ్వ- ఒక కేజీ(ఈ రవ్వ కేవలం కర్నూలు జిల్లాలో మాత్రమే దొరుకుతుంది)
మైదా పిండి- మూడు టేబుల్ స్పూన్లు
నూనె- 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు- చిటికెడు
ఒక గిన్నెలో 1Kgపేని రవ్వ ,మూడు టేబుల్ స్పూన్ల మైదాపిండి,చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు నీళ్లు పోస్తూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి.చివరగా కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి కేజీన్నర శనగపప్పు కి ఒక కేజీ పేని రవ్వ నానబెట్టుకోవాలి.