Перейти к содержимому

Game: సైక్లింగ్ ఆట

CRISP - Early Childhood Education

0:00 / 0:00

Game: సైక్లింగ్ ఆట

9 238 просмотров · 1 год назад
CRISP - Early Childhood Education
519 подписчиков
9 238 просмотров · 1 год назад
ఈ ఆట ద్వారా పిల్లలు తమ ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం గురించి తెలుసుకుంటారు. పరిసరాలు, స్థలాల పట్ల అవగాహన కలిగిఉంటారు. ఈ ఆటలో పిల్లలు కాళ్లను కదిలిస్తూ సైకిల్ తొక్కినట్లుగా చేయడం ద్వారా శారీరక అభివృద్ధి పొందుతారు. టీచర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం, చర్చించడం ద్వారా భాషా అభివృద్ధి కలుగుతుంది. ప్రశ్నలను అర్థం చేసుకొని సరైన జవాబు చెప్పడం ద్వారా జ్ఞానాత్మక అభివృద్ధి పెరుగుతుంది. పిల్లలు కలిసి కూర్చుని ఆడడం ద్వారా సామాజిక అభివృద్ధి సాధించబడుతుంది. సైక్లింగ్ ఆట: విధానం 1. పిల్లలందరిని ఒక వుత్తంలో టీచర్ చుట్టా కూర్చోపెట్టుకోవాలి. వాళ్ళందరినీ కాళ్ళు చాపమని చెప్పాలి. టీచర్ కూడ కాళ్ళని చాపి చేతులు ముందుకి పెట్టి సైకిలును పట్టుకున్నాట్టు పట్టుకోవాలి. పిల్లలందరని కూడు అదే చెయ్యమని చెప్పాలి. అప్పుడు పిల్లలతో ట్రింగ్ ట్రింగ్ అంటూ టీచర్ సైకిలు తొక్కించడం చెయ్యాలి. 2. టీచర్ పిల్లలతో సైకిల్ తొక్కిస్తూ ఊరు , మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం మీద అవగాహన కలిగెలా సంభాషణ చెయ్యాలి. ఉదా: ఎక్కడకి వెళ్దాం పిల్లలు? మన అంగన్వాడీ ఎక్కడ ఉంది? మనది ఏ ఊరు? మన రాజధాని ఎక్కడ?