శ్రీ కోటమ్మతల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగం.. ఉభయధాతలుగా కోమారి కృష్ణ కుటుంబ సభ్యులు..
Bharath Communication Network
0:00 / 0:00
శ్రీ కోటమ్మతల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగం.. ఉభయధాతలుగా కోమారి కృష్ణ కుటుంబ సభ్యులు..
152 просмотра · 1 дн. назад
Bharath Communication Network
5,97 тыс. подписчиков
152 просмотра · 1 дн. назад
నెల్లూరుజిల్లా, కోట మండలం, కోట పట్టణంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి - లక్ష్మీకవితమ్మ దంపతులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతీ శుక్రవారం దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహించిన అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి వాకాడు మండలం, తిరుమూరు గ్రామానికి చెందిన కొమారి కృష్ణ, రుక్మిణమ్మ, చిరంజీవులు చరిత్, చైత్రిక ఉభయదాతగా వ్యవహరించారు. చరిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నప్రసాద వినియోగం ఏర్పాటు చేయడం జరిగిందని, దాతల దాతృత్వంతో 2021 నుంచి జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి, సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు.. అలాగే ఈ సందర్భంగా ఉభయధాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సారె, కండువాలతో ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ సత్కారాన్ని ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు అందించారు. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, సుధాకర్ స్వామి, శ్రీరాం సుధాకర్, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావ్, నాగయ్య, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు...