podagantimayya - పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా
Soulspire Sangeeth
0:00 / 0:00
podagantimayya - పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా
12 411 просмотров · 5 месяцев назад
Soulspire Sangeeth
1,29 тыс. подписчиков
12 411 просмотров · 5 месяцев назад
#annamayyakeerthanalu #annamayya #telugusongs #devotionalsongs #tirumalatirupati #lordvenkateshwara #telugumusic #bhagavadgita
ఆన్నమాచార్య కీర్తన
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా
భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
శ్రీమద్భగవద్గీత
15.18 క్షర, అక్షర పురుషులకు వేరుగా ఉండే, శ్రేష్టుడను అవ్వటంవల్ల నేను జగత్తులో మరియు వేదములలో పురుషోత్తమునిగా ప్రసిద్ధి పొందాను.
9.18 గమ్యం, భరించువాడు, ప్రభువు, సాక్షి, నివాసస్థలము, ఆశ్రయం, ఆప్త మిత్రుడు నేనే. సృష్టి, ప్రళయము, అన్నిటికీ స్తానము, విశ్రాంతి స్థానము, నాశములేని విత్తనము నేనే.
9.19 ఓ అర్జునా! వేడిని ఇచ్చేది, వర్షాన్ని ఆపటం, కురిపించటం చేసేది నేనే. అమృతత్వముము మరియు మరణం నేనే. భౌతికము మరియి ఆధ్యాత్మికత్వము నేనే.
15.5 అందరి హృదయాలలో నేను నిలిచి ఉన్నాను. నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరుపు అనేవి కలుగుతున్నాయి. నేనే అన్ని వేదముల ద్వారా తెలియదగినవాడను. నిజానికి వేదాంతకర్తను, వేదములు తెలిసినవాడను నేనే.
10.28 నేను ఆయుధములలో వజ్రాయుధమును, ఆవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మధుడను మరియు పాములలో వాసుకిని అయి ఉన్నాను.
9.16 నేనే వైదిక క్రతువును, యజ్ఞమును, పితృదేవతలకు అర్పించు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్రమును అయి ఉన్నాను. నెయ్యిని, నిప్పును, హోమములో అర్పించు హుతమును కూడా నేనే.
5.29 నేను అన్ని యజ్ఞములకు మరియు తపస్సులకు భోక్తనని, అన్ని లోకాలకు అధిపతినని, అన్ని జీవులకు శ్రేయొభిలాషినని, తెలిసిన జ్ఞాని భౌతిక దుఃఖముల నుండి దూరమై పరమశాంతిని పొందును.